RC 16 First Pre Look: గ్లోబల్ సూపర్‌స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు మార్చి27. అభిమానులకు పండగ రోజు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను విడుదల చేయనున్నారు. దానికి సంబంధించిన ముహూర్తం ఫిక్స్ చేశారు. బుచ్చిబాబు సన విషయానికొస్తే.. ఫస్ట్ మూవీ "ఉప్పెన"తో బ్లాక్‌బస్టర్ విజయం సాధించారు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీని తెరకెక్కించబోతున్నారు. ఈ పాన్-ఇండియా సినిమాటిక్ వండర్‌ను పవర్‌హౌస్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సగర్వంగా సమర్పిస్తోంది. ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తూ నెక్ట్స్ రేంజ్ గ్రాండియర్ చిత్రంగా దీన్ని రూపొందించటానికి సుకుమార్ రైటింగ్స్ ఈ ప్రాజెక్ట్ లో చేరింది. సినీ నిర్మాణ రంగంలోకి ఈ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు వెంకట సతీష్ కిలారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై రూపొందనున్న ఫస్ట్ సినిమా ఇదే కావటం విశేషం.
ఎక్కడా కాంప్రమైజ్డ్ మేకింగ్‌తో స్క్రీన్‌పై సరికొత్త అనుభవాన్ని ప్రేక్షకులకు అందించే ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా వచ్చే అప్డేట్ కోసం అభిమానులు ఎంత ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే అందరి అంచనాలకు తగ్గకుండా మేకర్లు టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయబోతోన్నారు. ఈ గురువారం ఉదయం 9 గంటల 9 నిమిషాలకు అప్డేట్ ఇవ్వబోతోన్నారు. అయితే అంత వరకు ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేలా ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రామ్ చరణ్ లుక్ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చారు. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
రా అండ్ రస్టిక్, రగ్డ్ లుక్‌లో రామ్ చరణ్ కనిపించబోతోన్నట్టు సమాచారం. చేతిలో చుట్ట, పొడవైన జుట్టు, గుబురు గడ్డం లుక్‌లో గురువారం రామ్ చరణ్ తన లుక్ తో అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్‌ను ఎలా చూడాలని కోరుకుంటున్నారో అలానే బుచ్చిబాబు చూపించబోతూన్నాడు. మాస్ పల్స్ తెలిసిన బుచ్చిబాబు రామ్ చరణ్‌ను మరింత రగ్డ్ లుక్‌లో చూపించబోతోన్నట్టు తెలుస్తోంది.
ఈ చిత్రంలో భారతీయ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రఖ్యాత నటులు, సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఈ చిత్రంలో కీలకమైన.. పవర్ ఫుల్ రూల్ ను పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి ఇతర లీడ్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి చేయనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









