Naatu Naatu: సూర్య, సచిన్ టెండుల్కర్ తో కలిసి రామ్ చరణ్ నాటు నాటు.. వైరల్ అవుతున్న వీడియో

Ram Charan and Sachin Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆర్ఆర్ఆర్ మూవీలో ఆస్కార్ గెలుచుకున్న నాటు నాటు పాటకు స్టెప్పులు వేస్తే.. ఆ సీన్ చూడడానికి ఎంతో డిఫరెంట్ గా ఉంటుంది కదా. ఇప్పుడు అదే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 6, 2024, 07:11 PM IST
Naatu Naatu: సూర్య, సచిన్ టెండుల్కర్ తో కలిసి రామ్ చరణ్ నాటు నాటు.. వైరల్ అవుతున్న వీడియో

Ram Charan and Suriya: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. యావత్ ప్రపంచం దృష్టి టాలీవుడ్ వైపు తిరిగేలా చేసిన ఈ మూవీలో నాటు నాటు పాట సూపర్ హిట్ గా నిలిచింది. ఆస్కార్ అవార్డు సైతం అందుకుంది ఈ సాంగ్. రీసెంట్ గా జరిగిన అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో కూడా ఈ పాటకు ఖాన్ త్రయం స్టెప్పులు వేశారు. ఇప్పుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ పాటకు డాన్స్ చేశారు. అది కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి స్టేడియంలో. మరి ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం..

గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ కు వరల్డ్ వైడ్ పాపులారిటీ పెరిగిపోయింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మొన్న జరిగిన అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో టాలీవుడ్ నుంచి ఆహ్వానం అందుకుంది ఒక్క రామ్ చరణ్ మాత్రమే. ఆ ఈవెంట్ లో భాగంగా స్టేజీపై నాటు నాటు పాటకు షారుక్, సల్మాన్, అమీర్ ఖాన్ లు స్టెప్పులు వేశారు. పర్ఫామెన్స్ మధ్యలో షారుక్ రామ్ చరణ్ స్టేజ్ మీదకు పిలవగా ఆ ముగ్గురితో కలిసి రాంచరణ్ కూడా ఈ పాటకు డాన్స్ వేశాడు. ఈ నేపథ్యంలో చరణ్ స్టేజ్ మీద షారుక్ పిలిచిన విధానం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 

ఇక ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు మరొకసారి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, తమిళ్ నటుడు సూర్య , హిందీ లెజెండరీ యక్టర్ బొమన్ ఇరానీలతో కలిసి రామ్ చరణ్ నాటు నాటు పాటకు స్టెప్పులు వేశారు. ముంబై వేదికగా జరుగుతున్న ఐఎస్‌పీఎల్‌ మ్యాచ్ ల ప్రారంభ వేడుకల్లో ముఖ్యఅతిథిగా రామ్ చరణ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా నాటు నాటు పాటకు అనుకోకుండా రామ్ చరణ్ సచిన్ తో స్టెప్పులు వేయించాల్సి వచ్చింది. 

ఈ వీడియోని వైరల్ చేసిన చెర్రీ ఫ్యాన్స్ రామ్ చరణ్ అంటే ఇలా ఉంటుంది అంటూ పరోక్షంగా షారుక్ కి చురకలు అంటిస్తున్నారు. సినిమా విషయాలకి వస్తే ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత రామ్ చరణ్ నుంచి మరొక మూవీ ఇంతవరకు విడుదల కాలేదు. శంకర్ డైరెక్షన్లో అతను నటిస్తున్న గేమ్ ఛేంజర్  ఈ సెప్టెంబర్ లో విడుదల అయ్యే అవకాశం ఉంది.

Read More: Actress Kajal Agarwal: హీరోయిన్ కాజల్ అగర్వాల్ నడుముపై చెయివేసిన అభిమాని.. సోషల్ మీడియాలో రచ్చగా మారిన వీడియో ఇదే..

Read More: Pragya Jaiswal Bikini Pics: బికినీలో బ్లాస్ట్ చేసిన ప్రగ్యా జైస్వాల్.. మరి ఇంతలానా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News