Ram Charan RC16 Update: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిని సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. ఇక ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో చేసిన గేమ్ ఛేంజర్ సినిమా ఎంత డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా ఫ్లాప్ అవడంతో రామ్ చరణ్ తన తదుపరి సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు.
అందులో భాగంగానే తాజాగా రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ డ్రామా సినిమా చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తూ ఉండగా.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.
ఇక ఈ సినిమాలో శివరాజ్ కుమార్, జగపతిబాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు . ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా తాజాగా హైదరాబాదులో ఒక కీలక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది . ఇందులో రామ్ చరణ్, దివ్యేందు లపై క్రికెట్ నేపథ్య సన్నివేశాలను తెరకెక్కించగా.. తదుపరి షెడ్యూల్ మార్చి తొలివారం నుంచి ఢిల్లీలో మొదలుకానున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్ తో పాటు ప్రధాన తారాగణం పై కుస్తీ నేపథ్య సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇది దీనిని బట్టి చూస్తే.. ఈ సినిమాలో క్రికెట్, కుస్తీతో పాటు మరికొన్ని ఆటలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం.. మరి చరణ్ దీంట్లో అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఒక కొత్త క్యారెక్టర్రైజేషన్ లో మనకు కనిపించనున్నారు. అంతే కాదు ఈ చిత్రానికి పెద్ది అనే పేరుతో పాటు మరో రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ తో పాటు టీజర్ ని కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు.
Also Read: YSRCP MLAs Entry Assembly: వైఎస్ జగన్ యూటర్న్..! అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం
Also Read: APPSC Group 2 Mains: చంద్రబాబుకు భారీ షాక్.. రేపు యథావిధిగా ఏపీపీఎస్సీ గ్రూపు 2 పరీక్షలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









