Peddi First: శ్రీరామ నవమి రోజున రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీపై బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ గెట్ రెడీ..

Peddi First Glimpse: గ్లోబ‌ల్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కథానాయికుడిగా.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పెద్ది’. రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ టైటిల్ పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నా.. రంగస్థలం తర్వాత మరోసారి గ్రామీణ నేపథ్యంలో రామ్ చరణ్ సినిమా ఉండబోతున్నట్టు తెలిపారు. ఉగాది సందర్బంగా పెద్ది మూవీ మేకర్స్ రెండు అప్డేట్స్ ఇచ్చారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 31, 2025, 08:18 AM IST
Peddi First: శ్రీరామ నవమి రోజున రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీపై బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ గెట్ రెడీ..

Peddi First Glimpse: ‘ఉప్పెన’ చిత్రంతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న బుచ్చిబాబు సానా..తన రెండో చిత్రాన్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా ఈ సినిమా కు ‘పెద్ది’ టైటిల్ తో ఈ చిత్రంపై అంచనాలు పెంచారు మేకర్స్. ఇందులో రామ్ చ‌ర‌ణ్ పూర్తిగా..గడ్డంతో డిఫరెంట్ లుక్ తో అట్రాక్ట్ చేస్తున్నాడు.ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో రామ్ చ‌ర‌ణ్ మాస్ అవ‌తార్‌ని చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ పోస్ట‌ర్స్ కు సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా  ప్రేక్ష‌కుల్లో ఉత్సాహాన్ని, అంచ‌నాల‌ను మ‌రో లెవల్ కు  తీసుకెళ్లేలా పెద్ది సినిమా నుంచి గ్లింప్స్‌ను విడుద‌ల చేయ‌బోతున్నారు మేక‌ర్స్‌. ‘ఫ‌స్ట్ షాట్‌’ పేరుతో ‘పెద్ది’ చిత్రం నుంచి శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఏప్రిల్ 6న ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో క్రీడా మైదానంలోకి డైన‌మిక్‌గా దూకుతోన్న రామ్ చ‌ర‌ణ్‌ను చూడొచ్చు. ఈ పోస్ట‌ర్‌తో గ్లింప్స్ ఎలా ఉండ‌బోతుందోన‌ని అంద‌రిలో ఆస‌క్తి మ‌రింత పెరిగింది.

Add Zee News as a Preferred Source

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ‘పెద్ది’ వంటి భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఎక్కడా కాంప్ర‌మైజ్ కాకుండా.. వృద్ధి సిన‌మాస్ బ్యాన‌ర్‌పై వెంక‌ట స‌తీష్ కిలారు నిర్మిస్తున్నారు. మూవీని చూసే ప్రేక్ష‌కుల‌కు అద్భుత‌మైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు మేక‌ర్స్‌.

‘పెద్ది’ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కథానాయికగా న‌టిస్తుంది. క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ క‌రుణ‌డ చ‌క్ర‌వ‌ర్తి శివ రాజ్‌కుమార్‌ మరో ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు. విలక్షణ నటుడు  జ‌గ‌ప‌తిబాబు, బాలీవుడ్  డిఫరెంట్ యాక్టర్ దివ్యేందు శ‌ర్మ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత  ఎఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.   ఆర్. రత్నవేలు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ  అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌గా పనిచేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ సినిమా నుంచి మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన అప్‌డేట్స్‌ను ఒకదాని తర్వాత మరొకటి అందిస్తామ‌ని మేక‌ర్స్ తెలియజేసారు.  అప్ప‌టి వ‌ర‌కు ఏప్రిల్ 6న శ్రీరామ‌న‌వమి సంద‌ర్భంగా పెద్ది చిత్రం నుంచి విడుద‌ల కానున్న ఫ‌స్ట్ షాట్ కోసం అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎంతో  ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

తారాగణం: రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు

ఇదీ చదవండి: Madhuri Dixit Love Affair: ప్రముఖ క్రికెటర్ తో మాధురి దీక్షిత్ లవ్ ఎఫైర్.. ఎందుకు బ్రేకప్ అయిందంటే..!

ఇదీ చదవండి:  Jaya Prada Husband: నటి జయప్రద పెళ్లై ముగ్గురు పిల్లల తండ్రిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.. షాకింగ్ నిజాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News