Ram Pothineni: ముదిరిన భాగ్యశ్రీ,‌ హీరో రామ్ ప్రేమాయణం.. ప్రూఫ్ ఇదే..!

Ram Bhagyashree love: రామ్ పోతినేని హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ప్రేమలో పడ్డట్లు వార్తలు రాగా.. అందుకు తగ్గట్టుగా ప్రూఫ్ ఇదే.. అంటూ కొన్ని మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ముఖ్యంగా వీరిద్దరూ పెట్టిన స్టేటస్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Written by - Vishnupriya | Last Updated : Apr 23, 2025, 02:01 PM IST
Ram Pothineni: ముదిరిన భాగ్యశ్రీ,‌ హీరో రామ్ ప్రేమాయణం.. ప్రూఫ్ ఇదే..!

Bhagyashree Borse dating: టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ,హీరోయిన్ భాగ్యశ్రీ  బోర్సే కాంబినేషన్లో డైరెక్టర్ మహేష్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అయితే జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంలో అటు హీరో రామ్, ఇటు భాగ్యశ్రీ ఇద్దరూ కూడా డేటింగ్ లో ఉన్నారనే విధంగా సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో సడన్గా వీరిద్దరి బంధానికి సంబంధించిన ఒక మీమ్ కూడా దర్శనమిస్తోంది.

Add Zee News as a Preferred Source

ఇక ఆ మీమ్ చూస్తే మాత్రం నిజంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారేమో అని అనిపిస్తుంది. ఇక ఆ మీమ్ విషయానికి వస్తే.. హీరో రామ్ తన ఇంస్టాగ్రామ్ లో  ఒక ఫోటో షేర్ చేశారు..”నేను నిన్ను చూసినప్పుడు నిన్ను చూస్తాను..  నేను నిన్ను చూడనప్పుడు కూడా నిన్నే చూస్తాను”అంటూ రామ్ క్యాప్షన్ పెట్టాడు.  

మరోపక్క భాగ్యశ్రీ కూడా ఫోటో షేర్ చేస్తే..”  హే క్యూటీ.. ప్రేమ అనే ప్రవాహంలో పడి గ్లో అవ్వడం మర్చిపోకు” అంటూ క్యాప్షన్ పెట్టింది.  ఈ రెండు ఫోటోలు కలిపి  మీమ్ క్రియేట్ చేశారు సోషల్ మీడియా పేజెస్.  అన్నిటికన్నా ముఖ్యంగా వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా ఇద్దరికీ.. చాలా వరకు ఒకేలా అనిపిస్తుంది. దీంతో ఇదే వీరిద్దరూ మనకు ఇస్తున్న ప్రూఫ్ అంటూ.. కామెంట్స్ పెడుతున్నారు అక్కడికి. “.. ఇద్దరూ ప్రేమలో పడడానికి ఇదే సాక్ష్యం "  అంటూ ఈ మీమ్ ని తెగ వైరల్ చేస్తున్నారు.  

ఇక సెలబ్రిటీస్ చాలామంది విషయంలో.. ఇలా ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారానే ముందుగా వారి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న సంగతి తెలిసింది. ఇక వీరిద్దరి ప్రేమ కూడా ముదరటం వల్లే ఇప్పుడు ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియచేస్తున్నారు అని ఎంతోమంది అభిప్రాయపడుతున్నారు. ఏది నిజమో తెలియదు కానీ ప్రస్తుతం వీరిద్దరూ వార్తలు తెగ వైరల్ అవుతున్నారు.

 

భాగ్యశ్రీ  విషయానికి వస్తే..  మొదటిసారి హీరో రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ కూడా తన మొదటి సినిమాతోనే తన అందంతో నటనతో అందరినీ ఆకట్టుకుంది. దీంతో పలు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంది.  

అలా విజయ్ దేవరకొండతో కింగ్ డమ్ సినిమాతో పాటుగా రామ్ పోతినేని 22వ సినిమాలో కూడా  నటిస్తోంది. ఇలాంటి సమయంలోనే ఇలా లవ్ రూమర్స్ వినిపిస్తూ ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఈ లవ్ రూమర్స్ పై భాగ్యశ్రీ స్పందించినా సరే ఆగడం లేదు

Also Read: UPSC Final Results: యూపీఎస్సీ ఫలితాలు విడుదల.. ర్యాంకులు చెక్‌ చేసుకోవడం ఇలా!

Also Read: K Kavitha: 'తెలంగాణ ఆగమవుతుంటే చూస్తూ ఊరుకోవద్దు' గులాబీ శ్రేణులకు కవిత పిలుపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News