Rambha Re Entry: 90వ దశకంలో యువత కలల రాణిగా గ్లామర్ హీరోయిన్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు తెలుగులో ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా తెరకెక్కిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. కానీ ముందుగా విడుదలైన చిత్రం మలయాళంలో తెరకెక్కిన ‘సర్గమ్’. ఈమె కేవలం తెలుగులోనే కాదు హిందీ, కన్నడ, మలయాళం, తమిళం, భోజ్ పురి, బెంగాలీ, ఇంగ్లీష్ సినిమాల్లో సైతం అలరించిన ఘనత రంభ సొంతం. అంతేకాదు తెలుగులో సీనియర్ స్టార్స్ అయిన చిరంజీవితో ‘అల్లుడా మజాకా’, హిట్లర్, బావగారూ బాగున్నారా, ఇద్దరు మిత్రులు, బాలకృష్ణతో ..‘భైరవ ద్వీపం’, మాతో పెట్టుకోకు, వెంకటేష్.. ముద్దుల ప్రియుడు, నాగార్జునతో ‘హలో బ్రదర్’లో ఓ పాటలో మెరిచింది. అంతేకాదు హిందీలో మిథున్ చక్రబర్తి, అక్షయ్ కుమార్, సల్మాన్, వంటి హీరోల సరసన నటించి మెప్పించింది.
గత కొన్నేళ్లుగా రంభ ఈ సినీ ఇండస్ట్రీకి యాక్టింగ్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం రంభ రీ ఎంట్రీకి సిద్దంగా ఉన్నారు. అప్పట్లో రంభ అంటే గ్లామర్ ప్లస్ గ్రేస్ ఫుల్ డాన్సర్ గా ఈమెకు పేరుంది. అప్పట్లో రంభ స్టెప్పుల కోసం థియేటర్స్ కు వచ్చే ప్రేక్షకులు ఉండేవారంటే అతిశయోక్తి కాదు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
రంభ తన రీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ‘నా ఫస్ట్ ఛాయిస్ ఎప్పుడూ సినిమానే. నాకు ఇంత గుర్తింపు తీసుకొచ్చింది కూడా సినీ ఇండస్ట్రీనే కావడం విశేషం. ఇక ఇప్పుడు ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేసేందుకు అయినా నేను రెడీగా ఉన్నాను. ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నానన్నారు. కొత్త పాత్రలను ఎంచుకుని, మళ్లీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే సినిమాలతో రీ ఎంట్రీ ఇవ్వాలని ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. ఇక ఫ్యాన్స్.. ప్రేక్షకులు ఆమె రీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈమె ఓ క్రేజీ హీరో మూవీలో ఇంపార్టెంట్ రోల్ తో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా తర్వాత రంభకు వరుస అవకాశాలు రావడం పక్కా అని చెబుతున్నారు. మరి రంభ రీ ఎంట్రీ ఎలా ఉంటుందో.. ఎలాంటి చిత్రాలతో ఆడియెన్స్ ముందుకు వస్తుందో వెయిట్ అండ్ సీ.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









