Rana Naidu 2 Teaser: 'రానాని ఓడించేది అతడి తండ్రి ఒక్కడే'.. వెంకీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Rana Naidu 2 Teaser Released Here Review: పాత చింతకాయ పచ్చడినే బూతులతో తీశారనే వివాదంతో ఓటీటీలో విజయవంతంగా దూసుకెళ్లిన 'రానా నాయుడు' సీజన్‌ 2 త్వరలో రానుంది. ఈ క్రమంలో సీజన్‌ 2 టీజర్‌ను తాజాగా విడుదల చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 3, 2025, 08:27 PM IST
Rana Naidu 2 Teaser: 'రానాని ఓడించేది అతడి తండ్రి ఒక్కడే'.. వెంకీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Rana Naidu 2 Teaser: సినీ తారలు.. వీవీఐపీల వ్యక్తిగత వివాదాలను పరిష్కరించే రహాస్య గూఢచారి పాత్రలో దగ్గుబాటి రానా చేసిన వెబ్‌ సిరీస్‌ 'రానా నాయుడు' అనేక వివాదాలతో బంపర్‌ హిట్‌ పొందింది. తన బాబాయ్‌ దగ్గుబాటి వెంకటేశ్‌తో కలిసి చేసిన వెబ్‌ సిరీస్‌ విజయవంతం కాగా తాజాగా రెండో సీజన్‌ను సిద్ధం చేస్తున్నారు. పచ్చి బూతులతో ఓటీటీకెక్కిన ఈ సిరీస్‌ ఈసారి ఎలా వస్తుందో.. ఈ టీజర్‌లో రానా ఏ కేసులతో రాబోతున్నాడనే తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

Also Read: Masthan Sai: మస్తాన్‌ సాయి కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. తెరపైకి హీరో నిఖిల్‌ ప్రైవేటు వీడియోలు?

రెండేళ్ల కిందట విడుదలైన రానా నాయుడు సిరీస్‌ బూతులతో వివాదాల్లోకి ఎక్కింది. అయినా కూడా ప్రేక్షకులు ఆ సిరీస్‌ను విజయవంతం చేశారు. అనేక ఉత్కంఠ.. అద్భుత సన్నివేశాలతో రూపొందిన 'రానా నాయుడు' సీజన్‌ 2 రాబోతున్నది. సోమవారం సీజన్‌ 2కు సంబంధించి టీజర్‌ను వడుదల చేశారు. రానా మరో పోరాటానికి సిద్ధమైనట్లు టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. ఇక 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ కొట్టిన దగ్గుబాటి వెంకటేశ్ ఈ సీజన్‌లోనూ కీలక పాత్ర పోషించనున్నారు. వీరిద్దరూ తండ్రీకొడుకుల పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. 'రానా వచ్చేశాడు' అంటూ టీజర్‌ ప్రారంభమవగా పెద్దగా ఆసక్తికర సన్నివేశాలు లేకున్నా.. వెంకీ, రానా మధ్య పోరాటం ప్రధానంగా సీజన్‌ 2 రూపొందిస్తున్నట్లు చెప్పవచ్చు. 'ఈ ప్రపంచంలో రానాని ఓడించేది అతడి తండ్రి ఒక్కడే' అని వెంకటేశ్‌ వార్నింగ్‌ ఇస్తున్న సీన్‌ హైలెట్‌గా నిలిచింది.

Also Read: KP Chowdary: గోవాలో 'కబాలి' నిర్మాత ఆత్మహత్య.. సినీ పరిశ్రమలో విషాదం

'ఇప్పుడు ఇక అన్నీ పగిలిపోవాల్సిందే ఎందుకంటే ఇది రానా నాయుడు స్టైల్‌' అంటూ నెట్‌ఫ్లిక్స్‌ టీజర్‌ను విడుదల చేసింది. ఈ సీజన్‌ను 2025లో విడుదల చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. తొలి సీజన్‌ రానా నాయుడులో 2023లో విడుదలవగా.. 'తండ్రిని ద్వేషించే ఓ కొడుకు.. అతడికి గుణపాఠం చెప్పాలని ఓ తండ్రి ప్రయాణం' అనే ఇతివృత్తంతో రూపొందించారు. అయితే బోల్డ్‌ సన్నివేశాలు.. బూతులు ఉండడంతో ఇంటిల్లిపాది చూడలేక ఇబ్బందులు పడ్డారు. తీవ్ర వివాదం, విమర్శలు రావడంతో ఈ సీజన్‌లో కొద్దిగా డోస్‌ తగ్గిస్తారని తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News