Dhurandhar 5 Days Box Office Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ ఊచకోత కోస్తోన్న దురంధర్.. ఇది ఊహించని బీభత్సం..

Dhurandhar 5 Days Box Office Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో రణ్ వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్ ముఖ్యపాత్రల్లో ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దురంధర్’. ముందు నుంచి ఈ సినిమాపై అంచనాలు ఉండే. విడుదల రోజు బుకింగ్స్ మాములుగా ఉన్నా.. ఆ తర్వాత మౌత్ టాక్ తో ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దున్నేస్తోంది. 

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 10, 2025, 02:43 PM IST
Dhurandhar 5 Days Box Office Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ ఊచకోత కోస్తోన్న దురంధర్.. ఇది ఊహించని బీభత్సం..

‘దురంధర్’ ట్రైలర్ విడుదలతోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. విడుదల ముందు వీక్ ఈ సినిమా కాస్త బజ్ తగ్గినా.. రిలీజ్ తర్వాత ఈ సినిమా మౌత్ టాక్ బాక్సాఫీస్ దగ్గర వీర లెవల్లో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. వసూళ్ల పరంగా ఊర మాస్ రాంపేజ్ చూపెడుతూ ఫస్ట్ వీకెండ్ లోపు అంచనాలకు మించి వసూళ్లను దక్కించుకుంది. మొదటి మూడు రోజుల్లో మన దేశంలో హిందీలో రూ. 100 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. అటు సోమవారం రూ. 24 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం  మంగళవారం ఓపెనింగ్ డే రాబట్టిన రూ.28.60 కోట్ల నెట్ వసూల్లతో సంచనం రేపింది. ఓవరాల్ గా మన దేశంలో ఐదు రోజుల్లో రూ. 159.40 కోట్ల నెట్ వసూల్లతో దుమ్ము దులిపింది. 

Add Zee News as a Preferred Source

ఇక ఓవర్సీస్ లో దాదాపు రూ. 50 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 210 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా రూ. 250 కోట్ల గ్రాస్ వసూల్లతో దుమ్ము దులుపుతుంది. 1999లో కాందహార్ ఎయిర్ ప్లేన్ హైజాక్ తర్వాత మన దేశ భద్రతా సలహాదారు ఓ వ్యక్తిని పాకిస్థాన్ లో తన ఏజెంట్ గా నియమిస్తాడు. ఈ అజ్ఞాత వ్యక్తి భారత వ్యతిరేక శక్తులను ఎలా అంతం మొందించాడనేదే ‘దురంధర్’ మూవీ స్టోరీ.  అంతేకాదు 2004 నుంచి 2014 మధ్య అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా భారత్ ఎలాంటి దాడులను ఎదర్కొని మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అప్పటి ఆర్ధిక మంత్రి కారణంగా పాకిస్థాన్ లో దొంగ నోట్ల ముద్రణ అమాంతం పెరిగింది. 

Read more:  Chiranjeevi: పాయే.. మరోసారి చిరంజీవి పరువు పాయే..

Read more:  నాగార్జున ‘శివ’ 4K రీ రిలీజ్ టోటల్ కలెక్షన్స్.. సీనియర్ హీరోల్లో నాగార్జున సరికొత్త రికార్డు.. 

2014లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 2016 నవంబర్ లో నోట్ల రద్దు ఎందుకు చేయాల్సి వచ్చిందనేదే ఈ సినిమాలో చూపించారు. మొత్తంగా కాంగ్రెస్ ను బూచిగా చూపెట్టి తెరకెక్కించిన ఈ సినిమాలో అన్ని నిజాలే ఉన్నాయని జాతీయ వాదులు చెబుతుంటే కొంత మంది మాత్రం బీజేపీ కావాలనే తమను బద్నాం చేయడానికే ఈ సినిమా చేసారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. మొత్తంగా మెజారిటీ ప్రజల మన్ననలు అందుకున్న ఈ చిత్రం ఈ యేడాది  బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశాలున్నాయి. ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్ .. టైటిల్ రూల్ ‘దురంధర్’ పాత్రలో ఇరగదీసాడు. అటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. 

Read more:​  సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

Read more:​ సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News