Rashmika Mandanna Video: విజయ్ కాదు.. ఆ కెమెరా మెన్ తో ప్రేమలో రష్మిక..?.. ఏకంగా నా మనసు గెలిచావంటూ..!.. వీడియో వైరల్..

Rashmika mandanna latest news: రష్మిక మందన్న ముందు ఒక కెమెరామెన్ వచ్చి డ్యాన్స్ చేస్తు హల్ చల్ చేశాడు. అతని డ్యాన్స్ పర్ఫామెన్స్ చూసి నేషనల్ క్రష్ ఫుల్ ఫిదా అయ్యింది. ఈవీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 23, 2025, 01:53 PM IST
  • ఎయిర్ పోర్టులో ఫిదా అయిన నేషనల్ క్రష్..
  • లవ్ సింబల్ చూపిస్తు హల్ చల్..
Rashmika Mandanna Video: విజయ్ కాదు.. ఆ కెమెరా మెన్ తో ప్రేమలో రష్మిక..?.. ఏకంగా నా మనసు గెలిచావంటూ..!.. వీడియో వైరల్..

Rashmika mandanna Appreciates cameraman dance Video: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ గేర్ లో దూసుకుపోతుంది. ఈ అమ్మడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో సికిందర్ మూవీలో నటించింది. అయితే..ఈ సినిమాను మురుగదాస్ తెరకెక్కించారు. రంజాన్ కు కానుకగా ఈ మూవీ అభిమానుల ముందుకు రానుంది. ఇప్పటికే రష్మికను చాలా మంది గోల్డెన్ లెగ్ అంటున్నారు.

Add Zee News as a Preferred Source

చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాలో రష్మికతో నటించడం వల్ల సల్లుభాయ్ కు మంచి హిట్ దొరికనట్లే అని సల్మాన్ ఫ్యాన్స్ పండగ చేసుంటున్నారు. ఇక ఛావా సినిమాలో రష్మిక యేసుబాయ్ పాత్రలో, విక్కి కౌశాల్ సరసన అదిరిపోయేలా నటించారు. ఈ సినిమా ఇంకా బాక్సాఫీస్ మీద వసూళ్లను రాబడుతుంది. మరొవైపు రష్మిక సినిమాల పరంగా ఎంతగా వార్తలలో ఉంటున్నారో.. వివాదాల పరంగా కూడా అంతే రచ్చ చేస్తున్నారు. కర్ణాటకలో ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారిన సంగతి తెలిసిందే.

 

ఇవి పక్కన పెడితే.. తాజాగా... రష్మిక ఒక ఎయిర్ పోర్టులో  తన అభిమానితోచోటు చేసుకున్న ఘటన వార్తలలో నిలిచింది. రష్మికను ఒక కెమెరామెన్ తన డ్యాన్స్ తో ఫిదా చేశాడు. ఏకంగా ఎయిర్ పోర్టులో ఈ అమ్మడి కోసం ప్రత్యేకంగా సికిందర్ పాట మీద డ్యాన్స్ చేస్తు నేషనల్ క్రష్ ను తన క్రష్ గా మారేలా చేసుకున్నాడు.

Read more: Nidhi Agerwal: హీరోతో డేటింగ్.. ఆ పనిచేయోద్దని అగ్రిమెంట్.. బాంబు పేల్చిన హరిహర వీరమల్లు హీరోయిన్..!

ఇతగాడి స్టెప్పులు చూసిన రష్మిక ఫుల్ ఖుష్ అయ్యింది. తన మనసు గెలుచుకున్నావ్.. అంటూ కూడా లవ్ ఎమోజీని చూపించింది. మొత్తంగా ఎయిర్ పోర్టులో రష్మిక, కెమెరామెన్ ల మధ్య జరిగినఈ ఫన్నీ  వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు కొంత మంది ఇంకేం.. విజయ్ కు హ్యాండీచ్చినట్లేనా.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News