Rashmika Mandanna latest news: టాలీవుడ్, బాలీవుడ్, కన్నడ చిత్ర పరిశ్రమల్లో విజయవంతమైన రష్మిక మందన్నా తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇటీవల ఆమె ఒక కొత్త వివాదంలో చిక్కుకుంది. దీని కారణం ఏమిటంటే ‘కాంతార’ సినిమా గురించి గతంలో చేసిన కామెంట్లు మళ్ళీ వైరల్ అవుతున్నాయి.
రష్మిక మందన్నా గతంలో ‘కాంతార’ సినిమా గురించి మాట్లాడినప్పుడు, ఆ సినిమాను విడుదలైన వెంటనే చూడలేదని, కొంత ఆలస్యంగా చూసి చిత్రబృందానికి అభినందనలు తెలియజేశానని చెప్పింది. కానీ ఈ వ్యాఖ్యలు అప్పట్లో కన్నడ సినీప్రేమికులను కొంత నిరాశపరిచాయి. ఇక ఇప్పుడు మళ్ళీ ఈ వ్యాఖ్యలు వైరల్ కావడం మరోసారి చర్చకు దారి తీసింది.
రష్మికను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘కాంతార’ సినిమా గురించి మళ్ళీ ప్రశ్నించారు. అయితే, ఈ ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు కొత్తగా చర్చనీయాంశమైంది. ‘ఇది పాత కథే.. కానీ, ఇప్పటికీ ఇదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ లేవనెత్తడం ఆశ్చర్యంగా ఉంది’ అని రష్మిక చెప్పింది.
రష్మిక మాట్లాడుతూ, ‘నా వ్యక్తిగత విషయాలు ప్రపంచానికి చెప్పలేను. కెమెరా ముందు ప్రొఫెషనల్‌గా ఉండటమే నాకు ముఖ్యమని’ తెలిపింది. ఆమె ఎలాంటి అభిప్రాయాలైనా వ్యక్తిగతంగా ఉంటాయని, వాటిని బహిరంగంగా చర్చించడం ఇష్టం లేదని చెప్పింది. ఈ క్రమంలో కన్నడ అభిమానులు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తాము కూడా ఆమె ‘ఛావా’ సినిమా చూడను అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి రష్మిక అప్పుడు చేసిన చిన్న తప్పు కన్నడ ఇండస్ట్రీలో ఆమె జీవితాంతం వింటారేలా కనిపిస్తోంది.
ఐతే వివాదాలు వచ్చినా, రష్మిక కెరీర్ మాత్రం బాగా సాగుతోంది. ఇటీవల ఆమె నటించిన ‘ఛావా’ సినిమా హిట్ అయ్యింది. అంతకు ముందు ‘పుష్ప 2’ కూడా మంచి విజయం సాధించింది. వరుస విజయాలతో రష్మిక సినీ కెరీర్ మరింత బలంగా కొనసాగుతోంది.
Also Read: Konda Surekha Tears: విషాదంలో మంత్రి కొండా సురేఖ.. తట్టుకోలేక బోరున ఏడ్చేశారు
Also REad: Bride Baby Birth: పెళ్లయిన రెండు రోజులకే బిడ్డకు జన్మనిచ్చిన వధువు.. షాక్‌లో పెళ్లి కొడుకు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









