Rashmika mandanna makes her first appearance after engagement: రష్మిక మందన్న, విజయ్ దేవర కొండల ఎంగెజ్ మెంట్ జరిగిపోయిందని వార్తలు నెట్టింట తెగ వైరల్గా మారాయి. వీరిద్దరి పెళ్లి వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో జరుగనుందని వార్తలు వస్తున్నాయి. అయితే.. వీరిద్దరు మాత్రం దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే.. ఇటీవల విజయ్ దేవర కొండ పుట్టపర్తికి వెళ్లినప్పుడు తన చేతికి ఒక డైమండ్ రింగ్ కన్పించింది.
అది పక్కాగా ఎంగెజ్ మెంట్ రింగ్ అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. మరోవైపు రష్మిక కూడా ఇటీవల తన పెంపుడు శునకంతో ఆడుకుంటు ఉండగా.. ఒక రింగ్ తో కన్పించారు. దీంతో ఇవే వీరి డైమండ్ ఎంగెజ్మెంట్ రింగ్ లు అంటూ ఫిక్స్ అయిపోయారు. ఇంకా నో డౌట్ అంటూ పండగ చేసుకున్నారు.
అయితే.. తాజాగా.. రష్మిక మందన్న ముంబైలో థామా మూవీ ప్రమోషన్లతో పాల్గొన్నారు. ఈ వేడుకలో శ్రీవల్లి.. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి పాల్గొన్నారు. మలైకా అరోరా నటించిన తాజా పాట 'పాయిజన్ బేబీ' సోమవారం ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదలైంది. రష్మిక, ఆయుష్మాన్ తోపాటు, దర్శకుడు ఆదిత్య సర్పోత్దార్‌లు కూడా దీనికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో రష్మిక చేతికి ఉన్న డైమండ్ రింగ్ ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రష్మిక ఈవెంట్ వేదిక వద్దకు రాగానే అందరి దృష్టి ఆమె వజ్రపు ఉంగరంపైనే పడింది.
దీంతో అందరు కూడా దీనికంటే ఇంకా ఏంఫ్రూఫ్ కావాలంటూ కూడా ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇంకా పక్కా రష్మిక, విజయ్ ల మధ్య ఎంగెజ్ మెంట్ అయిపోయిందని అభిమానులు మరోసారి నెట్టింట రచ్చ చేస్తున్నారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.









