)
Rashmika Mandanna: రష్మిక మందన్న ప్రస్తుతం తన సినిమాల ప్రమోషన్స్ కోసమే కాకుండా వేరే చిత్రాలకు సంబంధించి స్పెషల్ స్క్రీనింగ్స్ కు హాజరవుతున్నారు. తాజాగా అనిమే అభిమానుల కోసం క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా నిర్వహించిన డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా – ఇన్ఫినిటీ క్యాసిల్ ప్రత్యేక ఫ్యాన్ స్క్రీనింగ్ ముంబైలో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు 250కి పైగా అభిమానులు పాల్గొనగా..ప్రత్యేక ఆకర్షణగా రష్మిక మందన్న టైగర్ ష్రాఫ్ కలిసి హాజరై సందడి చేసారు. అంతేకాదు అనిమే కల్చర్‌ను ఫ్యాన్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.
రష్మిక, టాంజిరో – నెజుకో సంబంధించిన ప్రత్యేక డ్రెస్సులో అభిమానులను అలరించింది. అటు టైగర్ తన జెనిట్సు–ఇన్స్పైర్డ్ జాకెట్లో ఫ్యాండమ్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వీళ్లిద్దరు అభిమానులతో మాట్లాడి వాళ్లలో హుషారు నింపారు. ఈ సందర్భంగా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. రష్మిక కూడా అభిమానులను వారి ఫేవరెట్ సీన్ గురించి అడిగింది. దీనికి పెద్ద ఎత్తున స్పందన రావడంతో “అకాజా vs గియు మరియు టాంజిరో” ఫైట్ సీక్వెన్స్ అని చెప్పడం విశేషం. డీమన్ స్లేయర్: ఇన్ఫినిటీ క్యాసిల్ టికెట్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఈ చిత్రాన్ని వివిధ భాషల్లో 750 పైగా స్క్రీన్స్ లో భారీ ఎత్తున సెప్టెంబర్ 12న విడుదల చేస్తున్నారు.
ఈ సినిమాను జపనీస్ భాషలకు చెందిన చిత్రాన్ని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో పాటు ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. భారత దేవ:లోనే అతిపెద్ద అనిమే థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. ఇక టైగర్ ష్రాఫ్ విషయానికొస్తే..తాజాగా ‘బాఘీ 4’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా ఓ మోస్తరు టాక్ తో మాస్ సెంటర్స్ లో నడుస్తోంది. రష్మిక మందన్న విషయానికొస్తే.. ఈ యేడాది ‘కుబేర’ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. త్వరలో ‘గర్ల్ ఫ్రెండ్’ మూవీతో పలకరించబోతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.