)
Rashmika Mandanna@9Years: నేషనల్ క్రష్ రశ్మిక మందన్న భారతీయ సినీ ఇండస్ట్రీలో 9 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకుంది. 9 ఏళ్ల కెరీర్ లో కన్నడ, తెలుగు, హిందీ, తమిళం సహా నాలుగు భాషల్లో మొత్తం 25 చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించింది. ఈ సినిమాల్లో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ తో పాటు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. హీరోయిన్స్ ప్రాంతీయంగా పేరు తెచ్చుకోవడం చూస్తుంటాం కానీ పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలు సాధిస్తూ తన స్టార్ డమ్ క్రేజ్ చూపిస్తోంది రశ్మిక. అందం, నటన, ఆకర్షణతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. మరో హీరోయిన్ కు లేనంత క్రేజ్ ను సొంతం చేసుకుంటోంది రశ్మిక.
తెలుగులో ‘ఛలో’, ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘పుష్ప 1’ పుష్ప 2 చిత్రాలు రష్మిక క్రేజ్ ను అమాంతం పెంచాయి. అంతేకాదు వెయ్యి కోట్ల రూపాయల సినిమాలను అలవోకగా అందుకుంటూ ఇండియన్ సినిమా క్వీన్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రశ్మిక.
పుష్ప, పుష్ప 2, యానిమల్, ఛావా చిత్రాలు రష్మిక క్రేజ్ ను పెంచాయి. తాజాగా దీపావళి కానుకగా విడుదలైన ‘థామా’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే మన దేశంలో రూ. 100 కోట్ల నెట్ వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. ముఖ్యంగా తక్కువ సమయంలోనే హిస్టారికల్, థ్రిల్లర్, యాక్షన్, హార్రర్ చిత్రాలతో అలరించడం మాములు విషయం కాదు. త్వరలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రంతో పలకరించబోతుంది రష్మిక. ఈ సినిమా నవంబర్ 7న విడుదల కాబోతుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తోంది.
అయితే బాక్సాఫీస్ నెంబర్స్ కంటే ప్రేక్షకుల ప్రేమే తనకు ముఖ్యమని చెబుతుంటుంది రశ్మిక మందన్న. ఈ అందాల గ్లామర్ క్వీన్ తన విజయాలను కొనసాగిస్తూ మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కు సైన్ చేసింది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రం రశ్మిక కెరీర్ లో మరో మైల్ స్టోన్ నిలవడం ఖాయం అంటున్నారు క్రిటిక్స్. మొత్తంగా ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న దానికి అసలు సిసలు నిర్వచనం రష్మిక మందన్న అని చెప్పాలి. ఈమె భవిష్యత్తులో కథానాయికగా మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవాలని కోరుకుంటోంది జీ న్యూస్ నెట్ వర్క్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.