Raveena tandon serious on katrina bathing video: ప్రయాగ్ రాజ్ కుంభమేళకు భారీగా భక్తులు తరలి వచ్చారు. దాదాపు.. 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన మహా కుంభమేళ కావడంతో భక్తులు మనదేశం నుంచిమాత్రమేకాకుండా.. ప్రపంచ దేశాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వచ్చారు. జన్వరి 13న ప్రారంభమైన కుంభమేళ ఫిబ్రవరి 26న మహాశివరాత్రి షాహీస్నానంతో ముగిసింది.
ఈ క్రమంలో కుంభమేళలో దాదాపుగా.. 70 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కారు వెల్లడించింది. అంతే కాకుండా.. కుంభమేళలోపుణ్యస్నానం చేసేందుకు బస్సులు, విమానాలు, రైళ్లు, ప్రత్యేకంగా వాహానాలలో భక్తులు తరలి వచ్చారు. యూపీ సర్కారు సైతం.. కుంభమేళకు వెళ్లే భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
అంతేకాకుండా.. కుంభమేళలో ఒకవైపు రాజకీయ నాయకులతో పాటు, సెలబ్రీటీలు సైతం భారీగా తరలివచ్చారు. అయితే..కుంభమేళలో ఇటీవల బాలీవుడ్ నటి కత్రీనా కైఫ్ సైతం పుణ్యస్నానాలు ఆచరించారు. ఆమె వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. కొంత మంది కత్రీనా స్నానం చేస్తుండగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలో ఒక నెటిజన్.. తాను కుంభమేళలో స్నానం చేస్తుమరోవైపు కత్రీనా స్నానం చేస్తున్న వీడియోను రికార్డు చేశారు.
తాను, తన సోదరుడి, కత్రీనా అంటూ వెకిలీగా నవ్వుతూ వీడియో తీసివైరల్ చేశారు. దీనిపై తాజాగా.. బాలీవుడ్ నటి రవీనా టాండన్ మండిపడ్డారు. పవిత్రమైన కుంభమేళకు వెళ్లి ఇలాంటి పనులు ఏంటని మండిపడ్డారు. మహిళ స్నానం చేస్తుండగా.. వీడియోలు తీయడమేంటని రవీనా టాండన్ అభిమానులపై సీరియస్ అయ్యారు.









