Jagamerigina Satyam Movie Review: మాస్ మహరాజ్ రవితేజ మేనళ్లుడు అవినాశ్ వర్మ హీరోగా .. తిరుపతి పాలె దర్శకత్వంలో రూపొందిన మూవీ జగమెరిగిన సత్యం. ఆద్య రెడ్డి హీరోయిన్‌గా యాక్ట్ చేయగా.. అమృత సత్యనారాయణ క్రియేషన్స్ బ్యానర్‌పై అచ్చ విజయ భాస్కర్ నిర్మించారు. ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి క్రియేట్ చేసింది. ఎమోషనల్ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా నేడు (ఏప్రిల్ 18) ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరీ అవినాశ్ వర్మ తొలి సినిమాతో హిట్ అందుకున్నాడా..? సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి..
కథ ఏంటంటే..?
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో దింద అనే పల్లెటూరులో జరిగే ఓ లవ్ స్టోరీ. ఆ గ్రామంలో తన మేన మామ ఇంటికి వచ్చిన సరిత (ఆద్య రెడ్డి).. అక్కడ సత్యం (అవినాశ్ వర్మ)ను చూసి ప్రేమలో పడుతుంది. అయితే వాళ్ల ప్రేమకు కులంతోపాటు రాజకీయాలు వారి ప్రేమకు అడ్డొస్తాయి. వారిద్దరు చనువుగా సమయంలో చిన్నమ్మ చూడడంతో గొడవలు జరుగుతాయి. ఈ తరుణంలోనే సత్యం మీద ఓ హత్య కేసు పడుతుంది. ఆ కేసు నుంచి సత్యం బయటపడ్డడా..? ప్రేమికులు ఇద్దరు ఒక్కటయ్యారా..? అనేది జగమెరిగిన సత్యం మూవీ స్టోరీ.
విశ్లేషణ..
సింపుల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీని ఎంచుకున్న దర్శకుడు తిరుపతి పాలె.. హీరో అవినాశ్ వర్మ క్యారెక్టర్‌ను బలంగా రాసుకున్నాడు. అన్ని ఎమోషన్స్‌ను హీరో పాత్రలో మిళితం చేశాడు. తెలంగాణ గ్రామీణ వాతావరణం ఎలా ఉంటుంది..? యాస, ఆచారాలను చూపిస్తూ చక్కగా కథనం నడిపించాడు. సత్యం చుట్టూ ఉండు పాత్రలను మనం నిజ జీవితంలో ఎక్కడో ఒక చోటు చూసినట్లే అనిపిస్తాయి. గ్రామంలోని రాజకీయాలు, మనిషి విలువలపై వచ్చిన సవాళ్లు అన్ని ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్ అంతా కామెడీ, లవ్, ఎమోషన్ సీన్స్‌తో సాగుతుంది. ప్రతి సీన్‌లోనూ ఊరి వాతావరణం, భాష, ఆచారాలు చూపించిన విధానం బాగుంటుంది. హృదయాన్ని తాకే భావోద్వేగ సన్నివేశాలత కట్టిపడేశారు. సెకండాఫ్‌లో యాక్షన్ సీక్వెన్స్‌తో మెప్పిస్తుంది. ఊరిని కొత్త దిశలో తీసుకువెళ్లడం బాగుంటుంది. క్లైమాక్స్‌లో ఎమోషనల్ హైపాయింట్ సినిమాకు ప్రాణం పోసింది.
సత్యం పాత్రలో అవినాశ్ వర్మ చాలా చక్కగా నటించాడు. ముఖ్యంగా ఎమోషన్ సీన్స్‌లో తన నటనతో ప్రేక్షకులను కంటతడి పెట్టించాడు. హీరోయిన్ ఆద్య రెడ్డి కళ్లతోనే ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. మరో హీరోయిన్ నీలిమకు మంచి స్కోప్ ఉన్న పాత్రే దక్కింది. మిగిలిన నటీనటులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. కథ, పాత్రలు, నటన, సినిమాటోగ్రఫీ అన్ని నేచురల్‌గా ఉన్నాయి. డైలాగులు, ఎమోషనల్ రైటింగ్ బాగున్నాయి. ఇది కేవలం ఒక సినిమా కాదని.. మన ఊరును, మన భూమిని, మన మనిషిని తాకే అనుభూతి అని చెప్పేలా తీశారు. కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగుతుంది. అదేవిధంగా మరికొన్ని పాత్రలకు మరింత డెప్త్ ఉండాల్సింది. అందరూ కొత్త నటీనటులు అయినా.. ఎక్కడా ఖర్చుకు వెనక్కి తగ్గకుండా నిర్మాత అచ్చ విజయ భాస్కర్ గ్రాండ్‌గా తీశారు. డైరెక్టర్ తిరుపతి పాలెకు మంచి డెబిట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. మ్యూజిగ్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి తన సంగీతంతో అలరించాడు. ముఖ్యంగా బతుకమ్మ సాంగ్, బీజీఏం అదిరిపోయింది. రియాలిటీ ప్రేమ కథలను ఇష్టపడేవారికి తప్పకుండా నచ్చుతుంది.
రేటింగ్: 2.75/5.
Also Read: Hyderabad: రన్నింగ్ ట్రైన్‌లో అత్యాచార యత్నం.. షాకింగ్ నిజం బైటపెట్టిన యువతి.. పోలీసులు సీరియస్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









