RC 16- Shiva Rajkumar: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సంచలన దర్శకుడు బుచ్చి బాబు కాంబినేషన్ లో RC 16 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే కదా. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇక కరుణడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆయన లుక్ కు సంబంధించిన లుక్ పూర్తైయింది. ఇటీవలే చిత్రబృందం శివన్న లుక్ టెస్ట్‌ని పూర్తి చేసింది. ఇక త్వరలోనే శివన్న రామ్ చరణ్ సినిమాలో షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. ఈ సినిమాలో రాజ్ కుమార్ పాత్రకు మంచి స్కోప్ ఉంది.
RC 16 షూటింగ్ లాస్ట్ ఇయర్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత నవంబర్‌లో మైసూర్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తైయింది. ఈ మధ్యే టీం హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్‌ను ఫినిష్ చేసింది. ఈ చిత్రంలో జగపతి బాబు, బాలీవుడ్ నటుడు మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ఆస్కార్ విన్నింగ్ మ్యూజికల్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమా కోసం సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.
Look test done ✅
Mass Look ❤️?Karnataka King #Shivanna will soon join the sets of #RC16 and begin shooting for his role ? #RamCharanRevolts ✊?#RamCharan | #ShivaRajkumar pic.twitter.com/bq7ocyQYkN
— Karnataka Box Office (@KBox_Office) March 5, 2025
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. రీసెంట్ గా ఈ సినిమా సెట్లో క్లీంకార సందడి చేసిన సంగతి తెలిసిందే కదా. రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ థియేట్రికల్ రన్ తర్వాత ప్రస్తుతం ఓటీటీ వేదికగా సందడి చేస్తోంది.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









