The Raja Saab hindi Box Office Collections:‘ది రాజా సాబ్’ హిందీ బాక్సాఫీస్ కలెక్షన్స్.. ప్రభాస్ కెరీర్ లో ఘోరం ఘోరాంతకం..

The Raja Saab Box Office Collection Day 12 : ప్యాన్ ఇండియా  రెబల్ స్టార్ ప్రభాస్ ఈ యేడాది యాక్ట్ చేసిన చిత్రం  ‘ది రాజా సాబ్’. దర్శకుడిని  మారుతి నమ్మి చేసిన ‘ది రాజా సాబ్’ సినిమా ప్రభాస్ కు పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. తాజాగా ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేసింది. మొత్తం డీటెల్స్ విషయానికొస్తే.. 

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 22, 2026, 04:06 PM IST
The Raja Saab hindi Box Office Collections:‘ది రాజా సాబ్’ హిందీ బాక్సాఫీస్ కలెక్షన్స్.. ప్రభాస్ కెరీర్ లో ఘోరం ఘోరాంతకం..

Rebel Star Prabhas The Raja Saab Hindi Net Box Office Collection: ‘కల్కి 2898 AD’ భారీ సక్సెస్ తర్వాత ప్రభాస్ పూర్తి స్థాయిలో హీరోగా నటించిన చిత్రం ‘ది రాజా సాబ్’. రెగ్యులర్ మాస్, సోషియో ఫాంటసీ వంటి సినిమా కాకుండా ‘చంద్రముఖి’ తరహాలో పూర్తి హార్రర్ కామెడీ ఎంటర్టేనర్ అంటూ చేసిన ‘ది రాజా సాబ్’ సినిమాతో తనకు కొత్త ఇమేజ్ వస్తుందని ఆశించిన ప్రభాస్ కు పూర్తి నిరాశే మిగుల్చింది.  హిందీ మార్కెట్ కోసం ఈ సినిమా స్క్రిప్ట్ లో పలు మార్పులు చేయడంతో అది పూర్తిగా వికటించిందనే చెప్పాలి.  అది వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపించింది. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో ప్రభాస్ కు మంచి ఇమేజే ఉంది. ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్స్ విషయానికొస్తే.. 

Add Zee News as a Preferred Source

హిందీలో మొదటి రోజు రూ. 5.2 కోట్ల అతి తక్కువ నెట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఫస్ట్ వీకెంట్ లో రూ. 12.75 కోట్ల నెట్ వసూల్లు అందుకుంటే.. ఫస్ట్ వీక్ లో రూ. 16 కోట్ల నెట్ వసూళ్లనే సాధించింది.ఓవరాల్ గా ఇప్పటి వరకు హిందీలో మన దేశంలో రూ. 22 కోట్ల నెట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకొని రన్ ముగించుకుంది. హిందీ ప్లస్ నార్త్ ఇండియా మార్కెట్ లో రూ. 35 కోట్ల షేర్ రాబట్టాల్సిన అవసరం ఉండగా.. కేవలం రూ. 13 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. మొత్తంగా ‘ది రాజాసాబ్’ సినిమాతో ప్రభాస్ హిందీ మార్కెట్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. స్క్రిప్ట్ బాకాలేకపోతే ఎవరైనా చూసేది లేదని అక్కడి ప్రేక్షకులు తెగేసి చెప్పేసారు. 

Read more:​ సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!

Read more:​  సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

మొత్తంగా బాలీవుడ్ మార్కెట్ ను నమ్ముకుని తీసిన ‘ది రాజా సాబ్’ సినిమా హిందీ ప్రేక్షకులకు ఛీత్కరించారు. అటు తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా తీసిన బాగుండేదనే టాక్ వినిపించింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 130 కోట్ల షేర్ (రూ. 250 కోట్ల గ్రాస్)వసూళ్లను దక్కించుకుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 209 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇంకా ఓవరాల్ బిజినెస్ పై రూ. 69 కోట్ల షేర్ రాబట్టాల్సిన అవసం ఉంది. ఏది ఏమైనా ఈ యేడాది సంక్రాంతికి ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిందనే చెప్పాలి. 

Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..

Also Read: ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News