Rekhachithram: మార్చి 7న సోనీ లివ్ లోకి మలయాళ సస్పెన్స్ బ్లాక్ బస్టర్ ‘రేఖా చిత్రం’..

Rekhachithram OTT Streaming: భారతీయ చిత్ర పరిశ్రమలో మలయాళ చిత్ర పరిశ్రమకు ప్రత్యేక స్థానం ఉంది. అక్కడి మేకర్స్ క్రైమ్, థ్రిల్లర్, మిస్టరీ చిత్రాలు ఎంత అద్భుతంగా తెరకెక్కిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలా మల్లూవుడ్ చిత్ర పరిశ్రమలోసంచలనం రేపిన చిత్రం ‘రేఖా చిత్రం’. తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కు రాబోతుంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 16, 2025, 01:05 PM IST
Rekhachithram: మార్చి 7న సోనీ లివ్ లోకి మలయాళ సస్పెన్స్ బ్లాక్ బస్టర్ ‘రేఖా చిత్రం’..

Rekhachithram OTT Streaming: ‘రేఖా చిత్రం’ మలయాలంలో సంచలనం రేపిన సస్పెన్స్ థ్రిల్లర్. ఈ చిత్రానికి జోఫిన్ టి. చాకో డైరెక్ట్ చేశారు. కావ్య ఫిల్మ్ కంపెనీపై వేణు కున్నప్పిల్లి నిర్మించిన ఈ చిత్రానికి థియేట్రికల్ గా  మంచి రెస్పాన్స్ వచ్చింది. మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.  75 కోట్ల వసూళ్లను సాధించి రికార్డులు సెట్ చేసింది.  ప్రస్తుతం మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘రేఖా చిత్రం’ మార్చి 7 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కు రాబోతుంది.
 
మలక్కప్పర ప్రాంతంలో జరిగే సంఘటన ఆధారంగా.. పోలీసు ఇన్‌స్పెక్టర్ వివేక్‌ను కలవరపరిచే ఆత్మహత్య కేసు చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. అయితే ఆ కేసుని ఛేదించడంలో ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేస్తాడు.  ఎటు వెళ్లినా కేసు పరిష్కారం కాదు. చివరకు ఈ కేసు.. మరో కేసుకి ఆధారంగా నిలుస్తుంది.

Add Zee News as a Preferred Source

సినిమా షూటింగ్, అందులో మిస్ అయిన ఓ వ్యక్తి.. పాతిపెట్టిన శవం దొరకడం వంటి సీన్స్ తో  ఈ సినిమాలో ట్విస్టుల మీద ట్విస్టులు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తయి. గ్రిప్పింగ్ కథనం, ఊహించని మలుపులతో ఫస్ట్ టూ లాస్ట్  ఉత్కంఠభరితంగా సాగే ఈ సినిమా సోనీ లివ్‌లోకి మార్చి 7న రాబోతోంది.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే..

ఈ సందర్భంగా లీడ్ నటుడు ఆసిఫ్ అలీ మాట్లాడుతూ..‘వివేక్‌ క్యారెక్టర్ లో నటించడం .. ఈ పాత్రకు న్యాయం చేయడం నాకు ఓ పెద్ద ఛాలెంజింగ్ అనిపించింది. ఇలాంటి క్యారెక్టర్స్ దొరకడం అంత ఈజీగా రాదు. ప్రేక్షకుల అంచనాలు, ఊహకు అందకుండా ఈ చిత్రం సాగుతుంది. వాస్తవానికి, ఊహకు మధ్య ప్రేక్షకులు  నిజాన్ని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. థియేటర్లలో మా సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది. మరి మలయాళ ప్రేక్షకుల మెప్పు పొందిన ఈ సినిమా  మార్చి 7న సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కు రాబోతుంది.  ఓటీటీలో  ఆడియెన్స్‌ని కూడా మా సినిమా మెప్పిస్తుందన్నారు. ఈ సినిమా మలయాళంతో పాటు మిగిలిన సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా స్ట్రీమింగ్ కు రావడం విశేషం. ఈ చిత్రంలో ఆసిఫ్ అలీ, అనశ్వర రాజన్, మనోజ్ కె. జయన్, సిద్దిక్, జగదీష్, సాయికుమార్,  హరిశ్రీ అశోకన్‌లతో సహా పవర్‌హౌస్ సమిష్టి తారాగణం ఉన్న ఈ చిత్రానికి సంగీతం ముజీబ్ మజీద్ అందించారు.

ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..

ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News