Hyderabad film festival: తెలుగు సినిమా ప్రేమికులకు అద్భుతమైన అనుభవాన్ని అందించే రెడ్ లోరీ ఫిలిం ఫెస్టివల్ మార్చి 21 నుంచి 23 వరకు ముంబై, హైదరాబాద్‌లో జరుగనుంది. హైదరాబాద్‌లో ఈ ఫెస్టివల్ Parallel Verse పేరుతో ప్రసాద్ మల్టీప్లెక్స్, ఎన్టీఆర్ మార్గ్‌లో నిర్వహించనున్నారు. ఈ వేడుకలో 70కిపైగా దేశ విదేశీ చిత్రాలు ప్రదర్శితమవ్వనున్నాయి. ముఖ్యంగా తెలుగు సినీ ప్రేమికులకు ‘టైమ్‌లెస్ టేల్స్’, ‘లెగసీ రీవైండ్’ విభాగాలను ప్రేక్షకుల ముందుకి తీసుకోరానన్నారు.
ఈ ఫెస్టివల్‌లో మాయాబజార్ (1957), మిస్సమ్మ (1955) వంటి ఎప్పటికీ చెరిగిపోని చిత్రాలను మళ్లీ వెండి తెరపై చూడొచ్చు. దర్శకుడు రమేష్ ప్రసాద్ ఈ అవకాశాన్ని తెలుగు సినీ రంగానికి గర్వకారణంగా పేర్కొన్నారు. అలాగే సింగీతం శ్రీనివాసరావు గౌరవార్ధం పుష్పక విమానం, తెలుగులో మొట్టమొదటి టైం మిషన్స్ సినిమా ఆదిత్య 369 చిత్రాలను.. ఈ సందర్భంగా ప్రదర్శించనున్నారు.
అంతేకాదు..సినీ అభిమానుల కోసం క్షణ క్షణం, హ్యాపీ డేస్, మన్మధుడు, నేనే రాజు నేనే మంత్రి వంటి ప్రేక్షకాదరణ పొందిన సినిమాలు ప్రదర్శితమవుతాయి. వీటిని వెండి తెరపై చూడడం.. సినీ ప్రేక్షకులకు తప్పకుండా ఒక ప్రత్యేక అనుభూతిని అందించబోతుంది అనడంలో సందేహం లేదు.
ఈ ఫెస్టివల్ కేవలం సినిమాలను చూడటానికి మాత్రమే కాక.. సినీ రంగ నిపుణులతో చర్చలు, ఇంటరాక్టివ్ సెషన్లకు కూడా అవకాశం కల్పిస్తోంది. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు..రామ్ గోపాల్ వర్మ సినిమా భవిష్యత్తు గురించి మాట్లాడనున్నారు. ఫీల్ గుడ్ సినిమాలకు పెట్టింది పేరైనా..శేఖర్ కమ్ముల.. స్క్రిప్ట్ అడాప్టేషన్‌పై తన అభిప్రాయాలు పంచుకోనున్నారు. స్క్రీన్ రైటర్ అంజుమ్ రాజబాలి బలమైన కథనాలను రూపొందించే రహస్యాలను వెల్లడించనున్నారు.
ఇక ఇతర ముఖ్యమైన సెషన్లో భాగంగా.. దర్శకుడు - నటుల సహకారం సెక్షన్ లో కృష్ణ వంశీ, శివ బాలాజీ, నవదీప్ పాల్గొంటారు. సినిమాటోగ్రఫీ మార్పులు, చేర్పులు గురించి వెంకట్ సి. దిలీప్ ఆధ్వర్యంలో చర్చ జరగనుంది. క్లాసిక్ కథలను కొత్తగా రీమెజిన్ చేయడం గురించి దర్శకుడు నీలకంఠ…అంతర్జాతీయ క్యాస్టింగ్ టెక్నిక్స్ గురించి టెస్ జోసెఫ్, సినిమా వారసత్వాన్ని కాపాడటం గురించి రమేష్ ప్రసాద్, డెబ్యూట్ డైరెక్టర్‌ల సవాళ్లు గురించి శ్రికరణ్ బీచరాజు చర్చించనున్నారు.
ఈ వారాంతంలో సినిమా ప్రేమికులు ఫెస్టివల్‌లో పాల్గొని, ప్రముఖ సినీ నిపుణులను కలుసుకునే అరుదైన అవకాశం పొందవచ్చు. టిక్కెట్లు ఆన్లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన టికెట్లు అన్నీ బుక్ మై షో లో లభిస్తాయి.
Also Read: Telangana Budget: ప్రభుత్వ ఉద్యోగులకు రేపు బడ్జెట్‌లో తీపి కబురు ఉంటుందా? నిరాశ తప్పదా?
Also Read: Revanth Reddy: 'శుభాకాంక్షలు నాకు వద్దు.. రాహుల్ గాంధీకి చెప్పండి'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









