Renu desai Serious on her second marriage trolls: కొన్నిరోజులుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ మాజీ భార్య పెళ్లిపై రకరకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. దీనికి తోడు ఏకంగా రేణు దేశాయ్ తనకు మరో తోడు కావాలని అనిపిస్తుందని కూడా మాట్లాడారు. ఆద్యకు ప్రస్తుతం 15 ఏళ్లు అని.. తనకు 18 ఏళ్లు వచ్చే వరకు ఆగి ఆ తర్వాత పెళ్లిపై ఒక నిర్ణయం తీసుకుంటానని కూడా చెప్పారు.ఈ క్రమంలో అప్పటి నుంచి రేణుదేశాయ్ పెళ్లిపై రకరకాల రూమర్స్ సోషల్ మీడియాల్లో తెగ వైరల్ చేస్తున్నారు.
అయితే.. తాజాగా..ఈ వార్తలపై రేణుదేశాయ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సీరియస్ గా మాట్లాడారు. అసలు.. తాను ఒక ఇంటర్వ్కూలో ఎన్నో విషయాలను గురించి మాట్లాడానని.. కానీ తన పెళ్లినే అందరు ఎందుకంత ఫోకస్ చేశారో అర్థంకావట్లేదన్నారు.తనకు 44 ఏళ్లు అని.. రెండో పెళ్లి చేసుకొవడం ఒక నార్మల్ పని అన్నారు. తనకు నచ్చిన వాళ్లను చేసుకుంటానని చెప్పుకొచ్చారు. ఇది తన వ్యక్తిగతం, కుటుంబానికి చెందిన విషయమన్నారు. అయితే..దీని వల్ల సమాజానికి ఎలాంటి లాభంలేదన్నారు. అసలు..దీన్ని ఎందుకంతా హైలేట్ చేస్తున్నారో.. అర్థంకావట్లేదన్నారు.
మొత్తంగా..నేను మహిళల భద్రత, ఎకానమిక్ డెవలప్ మెంట్, చదువు, పన్ను ఆంక్షలు.. వంటి చాలా అంశాలపై మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. కానీ తన పెళ్లిపై చేసిన కామెంట్స్ లపైన చాలా మంది ఫోకస్ చేశారన్నారు. ఇటీవల చాలా మందికి అసలు.. గాయత్రి మంత్రం అంటే తెలీదు. అంతే కాకుండా.. చిన్న చిన్న మంత్రాలు కూడా నేర్చించడంలేదు. కనీసం చిన్న చిన్న దేవుళ్ల శ్లోకాలు, మన సంప్రదాయాలు కూడా తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించడంలేదని బాధపడ్డారు.
కొన్నిసార్లు వైవాహిక జీవితంలో ఎలా ఉండాలని చెబితే.. నా మీదనే ట్రోల్స్ చేస్తున్నారని.. కూడా మాట్లాడారు. అయితే.. పెళ్లి బంధం అనేది ఇద్దరు కలిసి సాగించే జీవితం అని.. నేను గొప్ప... నువ్వు గొప్ప అని ఉండదని..ఇద్దరు కలిస్తేనే జీవితం సాఫీగా ముందుకు వెళ్తుందని అన్నారు. ప్రస్తుతం చాలా మంది పురుషుల్లో సైతం క్రమంగా మార్పులు వస్తుందని అన్నారు.
అసలు.. యువత తమ టాలెంట్ ను, చదువును సమాజంకు ఉపయోగపడే వాటిల్లో చూపిస్తే..దేశానికి కొంతైన ఉపయోగపడతారు.అంతే కానీ.. నేను రెండో పెళ్లి చేసుకుంటేను.. మరోటి అయితేను ఇతరులకు ఉపయోగపడేది ఏమి ఉండదని, అది పూర్తిగా తన వ్యక్తిగత మంటూ.. సోషల్ మీడియా ట్రోలర్స్ కు ఇన్ డైరెక్ట్ గా చురకలుపెట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









