Retro First Review: తమిళ హీరో సూర్య విభిన్న పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. కానీ సరైన సబ్జెక్ట్స్ లేక బాక్సాఫీస్ దగ్గర సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. కరోనా టైమ్ ‘ఆకాశం నీ హద్దురా’, జై భీమ్ సినిమాలు నటుడిగా మంచి పేరు తీసుకొచ్చాయి. కానీ థియేట్రికల్ విడుదలైన సూర్య సినిమాలేవి పెద్దగా మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయాయి. ఈ నేపథ్యంలో సూర్య హీరోగా నటించిన ‘కంగువా’ సినిమా ఈయన కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాగా నిలిచింది. అంతేకాదు అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులు క్రియేట్ చేసింది. కానీ థియేట్రికల్ గా మాత్రం ఈ చిత్రం బొక్క బోర్లా పడింది.
కంగువా ఇచ్చిన షాక్ నుంచి తేరుకొని కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘రెట్రో’ అంటూ 80ల కాలం నాటి సినిమా చేసాడు. ఈ సినిమా ట్రైలర్ కూడా ఇంప్రెసివ్ గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి బిజినెస్ సొంతం చేసుకుంది. మొత్తంగా చూసుకుంటే.. తెలంగాణలో - రూ. 3.50 కోట్లు.. రాయలసీమలో - రూ. 1.60 కోట్లు.. మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ లో -రూ. 4.40 కోట్లు.. ఓవరాల్ గా రూ. 9.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే బాక్సాఫీస్ దగ్గర రూ. 10.50 కోట్ల షేర్ రాబట్టాలి. ఇక తమిళనాడుతో పాటు వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
తమిళనాడు - రూ. 40 కోట్లు.. కేరళ + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి - రూ.5 కోట్లు.. తెలుగు రాష్ట్రాలు..రూ. 9.50 కోట్లు.. కర్ణాటక - రూ. 8 కోట్లు.. ఓవర్సీస్ - రూ. 18 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 80.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే.. రూ. 82 కోట్ల షేర్ రాబట్టాల్సిన అవసరం ఉంది. ఇక సూర్య సినిమా హిట్ అనిపించుకోవాలంటే.. దాదాపు రూ. 165 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సిన అవసరం ఉంది. గత కొన్నేళ్లుగా సూర్య ట్రాక్ రికార్డు చూస్తే బాగాలేదు. మరి ‘రెట్రో’ సినిమాతో సూర్య పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.
ఇదీ చదవండి: కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !
ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









