RK Roja: బుల్లితెరపై రోజా రీఎంట్రీ.. అదిరిపోయిన ప్రోమో.. ఓ రేంజ్‌లో శ్రీకాంత్ పొలిటికల్ పంచ్

RK Roja Re Entry: ఆర్‌కే రోజా మళ్లీ బుల్లితెర ప్రేక్షకులను అలరించనున్నారు. జీ తెలుగు టీవీలో ప్రసారం కానున్న సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్ 4 షోలో ఆమె మెరవనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు రిలీజ్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Feb 26, 2025, 05:10 PM IST
RK Roja: బుల్లితెరపై రోజా రీఎంట్రీ.. అదిరిపోయిన ప్రోమో.. ఓ రేంజ్‌లో శ్రీకాంత్ పొలిటికల్ పంచ్

RK Roja in Super Serial Championship 4 Show: గత ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత బుల్లితెరకు గుడ్‌బై చెప్పిన రోజా.. మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓటమి తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న మాజీ మంత్రి.. ఇప్పుడు జడ్జిగా అలరించేందుకు సిద్ధమయ్యరు. గతంలో జబర్దస్త్ షోకు జడ్డిగా వ్యవహరించిన రోజా.. నాగబాబుతో కలిసి షో సక్సెస్ కావడంలో కీ రోల్ ప్లే చేశారు. అయితే మంత్రి పదవి వరించిన తరువాత జబర్దస్త్ షోకు టాటా చెప్పేసి.. పొలిటికల్‌గా మరింత యాక్టివ్ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే పొలిటికల్‌గా పనులు చక్కదిద్దుతునే.. బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చారు. జీ తెలుగులో సూపర్ సీరియల్ ఛాంపియన్‌షిప్ 4 షో ద్వారా రీఎంట్రీ ఇచ్చారు.

Add Zee News as a Preferred Source

ఈ షోకు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు తాజాగా రిలీజ్ చేశారు. రోజాతోపాటు సీనియర్ హీరో శ్రీకాంత్, అలనాటి అందాల తార రాశి కూడా మెరిశారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీలో సీన్స్‌ రీక్రియేషన్‌తో అలరించారు. 'ప్రపంచంలో ఎనిమిదో వింత నేను చూస్తున్నానే..' అని శ్రీకాంత్ అనగా.. ఏంటది అంటూ రాశి అన్నారు. 'ఒక రోజు మిల్క్‌ ఇంకో రోజ్ మిల్క్ తాగుతోంది..' అంటూ పొగిడేశారు. మధ్యలో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కూడా ఎంట్రీ ఇచ్చారు. 'ఓ గంతులు వేస్తున్నారండి మా ఇండ్ల మీద ఎక్కేసి..' అంటే.. సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫేమ్ బుల్లిరాజా ఎంట్రీ ఇచ్చి నవ్వించాడు. 

 

తన స్టైల్‌లో 'నాన్న పిన్ని వచ్చేస్తుంది.' డైలాగ్ చెప్పగా.. రోజా ఎంట్రీ ఇచ్చారు. 'మీ ఇద్దరికి బ్రేకప్ ఎలాగైంది..' అని రాశి అడగ్గా.. 'నోట్లో నాలుక లేదు కదాండీ.. అలా బ్రేకప్ అయిపోయిందండి..' అని రోజా చెప్పారు. 'నీ నోట్లో నాలుక లేదంటే. మా అందరికీ బుర్రలేనట్టు అర్థం.' అని శ్రీకాంత్ కౌంటర్ ఇచ్చారు. అప్పుడు ప్రపోజ్ చేయడానికి అక్కడికి పిలిస్తే ఎందుకు రాలేదండి.. అంటూ రోజా అడగ్గా.. అసెంబ్లీకా.. అంటూ శ్రీకాంత్ ఆశ్చర్యంగా అడిగారు. మొత్తానికి ప్రోమోలో డైరెక్టర్ అనిల్ రావిపూడితోపాటు ఇతర స్టార్లు కూడా మెరిశారు. సూపర్ సీరియల్ ఛాంపియన్‌‌‌‌షిప్ 4 షో జీ తెలుగులో మార్చి 2వ తేదీ నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. యాంకర్ రవి, బిగ్‌ బాస్ భామ అషూరెడ్డిలు ఈ షోకు హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. 

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

Also Read: PM Kisan: పీఎం కిసాన్‌ 19వ విడుత నిధులు పడలేదా? ఫిర్యాదు చేయడం ఎలా? తెలుసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News