Robinhood OTT Streaming: డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, శ్రీలీల హీరోయిన్ గా నటించిన చిత్రం ‘రాబిన్ హుడ్’. తాజాగా ఈ సినిమా జీ టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమైంది. తెలుగు ఆడియన్స్ కు ఇరవై నాలుగు గంటలు నాన్ స్టాప్ వినోదం అందించే జీ తెలుగు ఈ వారం మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలతో అలరించేందుకు రెడీ అయింది. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఓ మోస్తరుగా అట్రాక్ట్ చేసిన ‘రాబిన్ హుడ్’ ను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మే 10వ తేదిన సాయంత్రం 6 గంటలకు జీ టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కానుంది.
మరోవైపు చిన్నపిల్లల్లోని నటనా ప్రతిభను వెలికితీస్తూ అశేష ప్రేక్షకాదరణతో కొనసాగుతున్న డ్రామా జూనియర్స్ 8 ఈ వారం మాతృదినోత్సవం ప్రత్యేక ఎపిసోడ్ తో అలరించేందుకు సిద్ధమైంది. ప్రారంభం నుంచీ జీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ ఈ వారం ఫినాలేకి చేరుకుంది. అంతేకాదు కుటుంబ కథతో పవన్ సాయి, అక్షిత, భావన ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సరికొత్త సీరియల్ ఘరానా మొగుడు స్టార్ట్ కానుంది.
డ్రామా జూనియర్స్ 8 మాతృ దినోత్సవ ప్రత్యేక ఎపిసోడ్ రాత్రి 9 గంటలకు, సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ గ్రాండ్ ఫినాలే ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఇక సరికొత్త ధారావాహిక ఘరానా మొగుడు మే 12న గ్రాండ్ గా స్టార్ట్ కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు, మీ జీ తెలుగులో ప్రసారం కానుంది. ఇక రాబిన్ హుడ్ సినిమా జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మే 10న సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. ‘రాబిన్ హుడ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 27.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 28.50 కోట్ల టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 9 కోట్ల షేర్ (రూ.16 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది.
వెంకీ కుడుముల దర్శకత్వంలో, నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాలో నితిన్, శ్రీలీల, దేవదత్త నాగే, సిజ్జు, డేవిడ్ వార్నర్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జీ తెలుగులో తప్పకుండా చూసేయండి.
ఇదీ చదవండి: కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !
ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









