Pranaya Godari: ప్రణయ గోదారి రిలీజ్ డేట్ లాక్.. పుష్ప-2 సందడి మొదలైన వెంటనే..!

Pranaya Godari Movie Release Date: ప్రణయ గోదారి మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. డిసెంబర్ 13న ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. కమెడియన్ అలీ సోదరుడి కుమారుడు సదన్ ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం కానున్నాడు.  

Written by - Ashok Krindinti | Last Updated : Nov 29, 2024, 10:06 PM IST
Pranaya Godari: ప్రణయ గోదారి రిలీజ్ డేట్ లాక్.. పుష్ప-2 సందడి మొదలైన వెంటనే..!

Pranaya Godari Movie Release Date: కమెడియన్ అలీ సోదరుడి కుమారుడు సదన్ హీరోగా.. ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తున్న మూవీ 'ప్రణయ గోదారి'. పీఎల్‌వీ క్రియేషన్స్‌పై  పారమళ్ల లింగయ్య నిర్మిస్తన్నారు. పీఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేారు. డిసెంబర్ 13న వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు రిలీజ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మూవీ అన్ని ప్రధాన పాత్రలను పోస్టర్‌లో చూపించారు. సాయికుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా.. 30YRS పృథ్వి, జబర్దస్త్ రాజమౌళి, సునిల్ రావినూతల తదితరులు ఇతరల పాత్రలు పోషిస్తున్నారు. 

Add Zee News as a Preferred Source

Also Read: Bala Krishna: వసుంధర ముందే బాలయ్యను కసితీర ముద్దు పెట్టిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?.. అవాక్కవ్వడం పక్కా..  

సాయి కుమార్ నటన, ఆహార్యం సినిమాకు మరింత ప్లస్ కానుందని మేకర్స్ చెబుతున్నారు. సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని.. సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని నమ్మకం ఉందన్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ మరింత షూరు చేశారు. మార్కండేయ సంగీతం అందిస్తున్నారు. కెమెరామెన్‌గా ఈదర ప్రసాద్ పని చేస్తున్నారు. కో డైరెక్టర్స్‌గా జగదీశ్ పల్లి, పురం కృష్ణ వర్క్ చేశారు. డిజైనర్‌గా TSS కుమార్ వ్యవహరించారు. కళాధర్ , మోహనకృష్ణ , రజిని కొరియోగ్రఫీ అందిస్తుండగా.. ఎడిటింగ్ బాధ్యతలు కొడగంటి వీక్షిత వేణు నిర్వర్తిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా విజయకృష్ణ పనిచేశారు. 

టెక్నీకల్ టీమ్

==> బ్యానర్ : పీఎల్‌వీ క్రియేషన్స్‌
==> ప్రొడ్యూసర్ : పారమళ్ళ లింగయ్య
==> డైరెక్టర్ : పీఎల్‌ విఘ్నేష్
==> మ్యూజిక్ డైరెక్టర్ : మార్కండేయ
==> కెమెరామెన్ : ఈదర ప్రసాద్
==> కొరియోగ్రాఫర్ : కళాధర్,మోహనకృష్ణ, రజిని
==> ఫైట్ మాస్టర్ : శంకర్ ,అహ్మద్
==> అస్టెంట్ డైరెక్టర్ : గంట శ్రీనివాస్
==> PRO: SR ప్రమోషన్స్ (సాయి సతీష్) 

Also Read: Deeksha Diwas: మళ్లీ తెలంగాణలో గులాబీ గుబాళింపు.. ధూమ్‌ధామ్‌గా కేసీఆర్‌ దీక్షా దివాస్‌

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News