Salman Khan misbehaves with Rashmika mandanna Video: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల సికిందర్ మూవీలో రష్మికతో సల్లుభాయ్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఈ మూవీని మురుగదాస్ తెరకెక్కించాడు. అయితే.. సికిందర్ మూవీ మార్చి 30న విడుదలైంది. అయితే.. ఈ మూవీకి అనుకున్నంత క్రేజ్ మాత్రం రాలేదు. ముఖ్యంగా ఈ మూవీని సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు. మరోవైపు సల్మాన్ ఖాన్ ఇంకా రిటైర్ అయిపోవచ్చని కూడా కామెంట్లు చేస్తున్నారు.
ఇక రష్మికను.. యానిమల్, పుష్ప2, ఛావాలతో హ్యాట్రిక్ దిశగా దూసుకుపోయి.. బాలీవుడ్ పాలిట గోల్డెన్ లెగ్ గామారిన రష్మికను మరల ఈ మూవీ డౌన్ ఫాల్ చేసిందని అభిమానులు ఫైర్ అవుతున్నారు. తప్పంతా సల్లుభాయ్ దేనని.. ఆయన వయసేంటీ.. రష్మికతో చేయడమేంటనీ కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. సికిందర్ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీని చూసేందుకు రష్మిక ముంబైలోని ఒక థియేటర్ కు వచ్చారు. అప్పుడు సల్మాన్ ఖాన్ కూడా అక్కడే ఉన్నారు. కొంత మంది ఫోటో గ్రాఫర్స్ రష్మిక, సల్మాన్ ఖాన్ లను ఫోటోలు దిగాల్సిందిగా కోరారు. అప్పటికే కారులో కూర్చుని ఉన్న రష్మికను సల్మాన్ ఖాన్ జబర్దస్తీగా బైటకు లాగినట్లు కన్పిస్తుంది. ఇప్పటికే కాలి నొప్పితో ఉన్న రష్మిక కనీసం దిగడానికి కూడా సమయం ఇవ్వకుండా.. సల్మాన్ జబర్దస్తీగా బైటకు లాగీ ఆమెను దగ్గరగా తీసుకుని ఫోటోలకు ఫోజులిచ్చాడు.
పాపం.. రష్మిక కూడా ఆ సమయంలో ఎంతో ఇబ్బందిగా ఫీలైనట్లు వీడియోలో స్పష్టంగా కన్పిస్తుంది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన రష్మిక ఫ్యాన్స్ కోపంతో మండిపోతున్నారు. సల్మాన్ ఖాన్ ఎంత నీచంగా ప్రవర్తించాడని తిట్టిపోస్తున్నారు. మరికొందరు రష్మికను ఇష్టమున్నట్లు అలా ఎలా తాకుతాడని కూడా అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.









