
Sikandar OTT Release Details: సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ "సికందర్" మార్చి 30న విడుదలైంది. రంజాన్ కానుకగా వచ్చిన ఈ సినిమా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం, మొదటి రోజే రూ.26 కోట్లు వసూలు చేయడం విశేషం. కానీ తరువాతి రోజుల్లో కలెక్షన్లు తగ్గడంతో సినిమా యావరేజ్ టాక్‌తో పరిమితమైపోయింది.
తొలి రోజు రూ.26 కోట్లు, రెండో రోజు రూ.29 కోట్లు వసూలు చేసినా.. నాల్గవ రోజు కలెక్షన్లు క్షీణించాయి. ఇప్పటి వరకూ ఈ చిత్రం రూ.82.25 కోట్ల గ్రాస్‌ను నమోదు చేసింది. అయినా దీనిని బాక్సాఫీస్ హిట్‌గా పరిగణించలేరు. గతంలో సల్మాన్ ఖాన్ నటించిన 'సుల్తాన్', 'టైగర్ 3' సినిమాలు కలిపి భారీ ఓపెనింగ్స్ సాధించగా, 'సికందర్' మాత్రం ఆ స్థాయికి చేరలేకపోయింది.
ఓటీటీలో స్ట్రీమింగ్ పై ఎదురుచూపులు
సినిమా థియేటర్లలో నిరాశపరిచినప్పటికీ, ఓటీటీలో విడుదలైతే మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశముందన్న నమ్మకంతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం 'సికందర్' డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఓటీటీలో మే నెలలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు టాక్. అయితే స్టార్ హీరో సినిమా అయింది కూడా విడుదలైన నెలలోనే ఇలా డిజిటల్ ప్లాట్‌ఫామ్ కి వస్తోంది అన్న విషయంపై ప్రస్తుతము ఎంతోమంది ఆశ్చర్యపోతున్నారు.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, ప్రతీక్ బబ్బర్, శర్మన్ జోషి వంటి నటులు కూడా కీలక పాత్రలు పోషించారు. సంగీతం, విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు మంచి టెక్నికల్ వర్క్ తో మెప్పించాయి. కానీ కథాకథనాల్లో తక్కువతనంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో థియేటర్లలో మాత్రం సినిమా పరిమిత స్థాయిలోనే నిలిచిపోయింది.
సల్మాన్ అభిమానులు సినిమా ఓటీటీలో విడుదలైతే పెద్ద సంఖ్యలో వీక్షణలు వస్తాయని ఆశిస్తున్నారు. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ లాంటి పాపులర్ ప్లాట్‌ఫారమ్‌లో రిలీజ్ అయితే గ్లోబల్ ఆడియన్స్‌కి ఈ సినిమా రీచ్ అవుతుందన్న గట్టి నమ్మకంతో ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe