)
Samantha: ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత.. మొదటి సినిమాతోనే కుర్రకారు ఏ మాయ చేసావే అనే అంతలా ఆమె అందానికి , నటనకు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారిపోయింది సమంత.. ఇదే సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడింది
ఇంకా అలా ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించి రెండు సాంప్రదాయ పద్ధతులలో వివాహం చేసుకున్నారు. ఇక వివాహం తర్వాత నాలుగేళ్లు సంతోషంగా ఉన్న ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకున్నారు. నాగచైతన్య, సమంత పెళ్లయిన కొత్తలో సమంత.. మంచు లక్ష్మి నిర్వహించిన ఒక టాక్ షోలో పాల్గొని పిల్లల గురించి వెల్లడించింది.
మంచు లక్ష్మి మాట్లాడుతూ.. పెళ్లికి ముందు వరకు నన్ను పెళ్లి చేసుకో సామ్ అని చాలామంది నుంచి మెసేజ్‌లు వచ్చేవి కదా.. ఇప్పుడైనా ఆగాయా అని అంటే.. ఆగాయి కానీ నీకు పెళ్లి అయ్యింది కదా.. ఏంటా బట్టలు.. ఎందుకలా మాట్లాడుతున్నావ్ ..అంటూ మెసేజ్‌లు చేస్తున్నారు అంటూ సరదాగా తెలిపింది సమంత.
నీకు పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టాక సినిమాకి బ్రేక్ తీసుకుంటావా లేక సినిమాలకు శాశ్వతంగా దూరం అవుతావా అని ప్రశ్నించగా.. ఇప్పటికే నాకు ఒక కొడుకు ఉన్నాడు అంటూ తన భర్తనే కొడుకుగా భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది సమంత. ఇక అలాగే ప్రతిరోజు పిల్లలకు చేసే ప్రతి పనిని తాను తన పెట్ డాగ్ కి చేస్తున్నాను అంటూ తెలిపింది. ఒక సెలబ్రిటీ అయి ఉండి కూడా తన ఇంట్లో ఉండే పెట్ డాగ్ కాలకృత్యాలు అన్నీ కూడా తానే స్వయంగా క్లీన్ చేస్తానని తెలిపింది.
ఇక ప్రెగ్నెన్సీ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇండస్ట్రీలోకి వస్తానని చెప్పింది
. కానీ అంతలోపే అనూహ్యంగా తన భర్త నుంచి విడిపోయింది సమంత. బహుశా ఈ మాటలు చెప్పేటప్పుడు ఆమె తమ విడిపోతామని ఎలా ఊహించి ఉంటుంది అని నిటీజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు.. ఏది ఏమైనా బంగారం లాంటి జీవితాన్ని సమంత కోల్పోయింది కానీ ఇప్పుడు స్వేచ్ఛగా ఒకవైపు సినిమాలు, మరొకవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూనే నిర్మాణ సంస్థను కూడా స్థాపించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe