Samantha Favourite Telugu Hero : ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి అడుగుపెట్టి.. ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌గా మారిన నటి సమంత రూత్ ప్రభు. ఈ హీరోయిన్ అన్ని భాషలలోనే సినిమాలు చేసి దేశవ్యాప్తంగా తన ప్రతిభను చాటుకుంటోంది. 2010లో ‘ఏ మాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఆమె, మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ సినిమా ద్వారా ఆమెకు భారీ అభిమాన బేస్ ఏర్పడింది. తర్వాత వరుస హిట్లతో టాలీవుడ్‌లో అగ్ర నాయికగా ఎదిగింది. బృందావనం, అత్తారింటికి దారేది, తెరి, మజిలీ వంటి సినిమాల్లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు, బ్రాండ్ అంబాసడర్‌గా కూడా ఎన్నో కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.
2017లో నటుడు నాగచైతన్యతో వివాహం చేసుకున్న సమంత..ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు అతనితో కలిసి జీవితాన్ని కొనసాగించింది. కానీ అనూహ్యంగా 2021లో విడాకులు ప్రకటించి అభిమానులను షాక్‌కు గురిచేసింది.
విడాకుల తర్వాత ఆమె పూర్తిగా తన కెరీర్‌పైనే దృష్టి పెట్టింది. ఈ సమయంలోనే బాలీవుడ్‌లో అవకాశాలు రావడం, వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ద్వారా హిందీ ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు పొందడం జరిగింది.
అయితే ఎన్ని భాషల్లో నటించినా ఆమెకు తెలుగు మాత్రం చాలా ప్రత్యేకమని ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సమంతకు ఒక తెలుగు హీరో అంటే చాలా ఇష్టం అంట. ఆమె ఓ ఇంటర్వ్యూలో మహేశ్ బాబు తన ఫేవరెట్ హీరో అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన హ్యాండ్సమ్ లుక్, స్టైల్ అంతే తనకు చాలా ఇష్టమని.. ‘దూకుడు’ సినిమాలో మహేశ్ బాబుతో కలిసి నటించడంతో తన కెరీర్‌లో గొప్ప అనుభవమని చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్.
ఇక మహేష్ బాబుతో దూకుడులోనే కాకుండా సమంత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కూడా కనిపించింది. వీరిద్దరూ పాల్గొన్న ఇంటర్వ్యూస్ లో కూడా ఇద్దరూ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ కనిపిస్తారు. ఈ క్రమంలో ఒకప్పుడు తెలుగులో తన ఫేవరెట్ హీరో ఎవరు అనగానే వెంటనే సమంత మహేష్ బాబు పేరు చెప్పిన విషయం.. ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతుంది.
ప్రస్తుతం సమంత బాలీవుడ్‌లో భారీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. ఆరోగ్య సంబంధిత సమస్యలతో కొంత విరామం తీసుకున్నప్పటికీ, తిరిగి ఫిట్‌గా మారి షూటింగ్‌లకు హాజరవుతోంది. ఇక సమంత సొంతగా నిర్మాణ సంస్థ కూడా పెట్టిన సంగతి తెలిసిందే. తన నిర్మాణ సంస్థ ద్వారా రానున్న శుభం సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది..
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









