Samantha: మరోసారి యంగ్ స్టార్ హీరోతో సమంతా రొమాన్స్..!

Samantha in RC17: ఆర్సీ 17లో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనే చర్చ Tollywood లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే జాన్వి కపూర్ ఎంపిక కాగా, రష్మిక మందన్నా, సమంత పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

Written by - Vishnupriya | Last Updated : Mar 4, 2025, 02:27 PM IST
Samantha: మరోసారి యంగ్ స్టార్ హీరోతో సమంతా రొమాన్స్..!

Samantha With Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ మరోసారి సినిమా చేయబోతోంది. ‘రంగస్థలం’తో సంచలన విజయం సాధించిన ఈ జోడీ, ఇప్పుడు ‘RC17’ కోసం కలసికట్టుగా పని చేయనుంది. ఈ ప్రాజెక్ట్ పుష్ప 2 తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రూపొందనుండగా, భారీ అంచనాల మధ్య తెరకెక్కనుంది.  

Add Zee News as a Preferred Source

‘RC17’ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ మూవీగా తెరకెక్కనుందని సమాచారం. ఇప్పటికే జాన్వి కపూర్ హీరోయిన్‌గా ఫిక్స్ కాగా, మిగతా క్యాస్టింగ్ విషయమై చర్చలు కొనసాగుతున్నాయి. హీరోయిన్ ఎంపికలో క్రేజీ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. రష్మిక మందన్నా మొదటి ఎంపికగా ఉన్నప్పటికీ, డేట్స్ అడ్జస్ట్ అవుతాయా? అన్నది అనిశ్చితంగా ఉంది.  

Chance for Smanatha' సమంత గతంలో ‘రంగస్థలం’లో రామలక్ష్మి పాత్రలో నటించి మెప్పించింది. ఇప్పుడు సుకుమార్ - రామ్ చరణ్ కాంబో మరోసారి వస్తుండటంతో, సమంత పేరు కూడా పరిశీలనలో ఉంది. కానీ ప్రస్తుతం ఆమె ఎక్కువగా బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌పైనే దృష్టి పెట్టడం, టాలీవుడ్ నుంచి కొంత దూరంగా ఉండటం కలిసిరాని అంశాలు.  

Samantha To Sign RC17'ఈ సినిమాకి సమంత సైన్ చేస్తే, అది టాలీవుడ్‌లో ఆమె రీ ఎంట్రీగా చెప్పొచ్చు. అయితే ఆమె తన రేంజ్‌కు తగిన పాత్ర అయితేనే ఒప్పుకుంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక సమంత నటిస్తే ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారుతుందని కూడా అంచనా.  

Samantha Career  'ప్రస్తుతం సమంత బాలీవుడ్ వెబ్ సిరీస్‌లు, హిందీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. కానీ, ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్‌గా ఆమెకి ఇప్పటికీ టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. టాలీవుడ్‌లో ఆమె హిట్ కాంబోలను పునరావృతం చేయాలనే ఆలోచన ఉంటే, ఈ సినిమా మంచి ఛాన్స్ అవుతుంది.  

ఈ మూవీ ఫైనల్ క్యాస్టింగ్ ఇంకా పూర్తిగా నిర్ణయించలేదు. సుకుమార్, రామ్ చరణ్ కలిసి తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరి సమంత ఈ అవకాశాన్ని అందుకుంటుందా? లేక మరో హీరోయిన్‌కు అవకాశం కలిగిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News