Viral Video: సెలబ్రిటీలు కనిపిస్తే చాలు కొందరు వారిని వేధించే రీతిలో వ్యవహరిస్తారు. వారి ఫొటోలు, వీడియోలు తీస్తూ హల్‌చల్ చేస్తుంటారు. అలా ఉదయమే ఆరు బయట కనిపించిన సమంతను ఫొటోలు, వీడియోలు తీస్తూ ఇబ్బందులకు గురి చేశారు. దీంతో ఆమె సహనం కోల్పోయారు. వెంటనే కోపంతో 'ఆపుతారా' అని కోప్పగించుకుంటూ కారెక్కి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఫొటోగ్రాఫర్ల తీరుతో సమంత పడిన ఇబ్బంది ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
తెలుగు సినీ పరిశ్రమకు దూరమైన సమంత ప్రస్తుతం ముంబైలో నివసిస్తోంది. నిత్యం జిమ్‌కు వెళ్లి సాధనాలు చేస్తుంటుంది. సమంత ఆరోగ్య రహాస్యం ఆమె ఫిట్‌నెస్. ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన సమంత రోజూ జిమ్‌కు వెళ్తుంటుంది. అయితే సమంత వెళ్లే జిమ్ తెలుసుకున్న కొందరు రోజు అక్కడ పడిగాపులు కాస్తుంటారు. సమంత ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు ఎగబడుతుంటారు. అలాగా మంగళవారం ఉదయం సమంత వెళ్లగా ఆమె చుట్టూ ఫొటోగ్రాఫర్లు, వీడియోలు మూగారు.
Also Read: K Kavitha: జూలై 17న తెలంగాణ జాగృతి రైల్ రోకో.. మోదీ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
'మేడమ్.. సమంత మేడమ్ గుడ్ మార్నింగ్' అంటూ పలకరించారు. ఆమె కొంత ఇబ్బంది పడుతూ లోపలికి వెళ్లారు. ఆ సమయంలో 'దయచేసి ఆపండి' అని సమంత కోప్పగించుకుని వెళ్లిపోయింది. జిమ్‌లో సాధన చేసిన అనంతరం కూడా మీడియా కంటపడడంతో అప్పుడు కూడా సమంతకు చిర్రెత్తుకొచ్చింది. 'ఆపండి గాయ్స్' అని అసహనం వ్యక్తం చేస్తూ సమంత కారు ఎక్కి వెళ్లిపోయింది. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.
జిమ్‌కు వెళ్తున్న సమయంలో సమంతను ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఇబ్బందులకు గురి చేశారు. ఇలా ఇబ్బందులు పడుతుండగా ఒక ఫొటోగ్రాఫర్ 'అలా అరవొద్దు' అని హెచ్చరించాడు. మేడమ్, మేడమ్ అంటూ చుట్టూ గుమిగూడడంతో సమంత ఇబ్బంది పడ్డారు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. మీడియా ప్రతినిధులపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫొటోలు, వీడియోల కోసం సెలబ్రిటీలను ఇలా ఇబ్బందులకు గురి చేయడం సరికాదని కామెంట్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









