Samantha Raj Nidimoru Honeymoon: టాలీవుడ్ హీరో నాగ చైతన్యతో విడాకుల తర్వాత హీరోయిన్ సమంత ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కొన్నేళ్లుగా డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్‌లో ఉన్న సామ్.. తాజాగా డిసెంబరు 1న పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ హనీమూన్‌కు వెళ్తారని అందరూ అనుకున్న సమయంలో ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది నటి సమంత. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్తగా పెళ్లైన జంట వెంటనే హనీమూన్‌కు వెళ్తారని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు డైరెక్టర్ రాజ్ నిడిమోరు, హీరోయిన్ సమంత ఇటీవలే పెళ్లి బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరూ కూడా హనీమూన్ ట్రిప్‌కు వెళ్తారని అంతా అనుకున్నారు. కానీ, ఇప్పుడు అందుకు భిన్నంగా జరుగుతోంది. సమంత అకస్మాత్తుగా ఓ షూటింగ్ స్పాట్‌లో కనిపించింది. ఆమె ప్రధానపాత్రలో తెలుగులో నిర్మితమవుతున్న ఓ సినిమా షూటింగ్‌లో సమంత పాల్గొంది. పెళ్లైన తర్వాత రెండు రోజులకే ఇలా సినిమా షూటింగ్‌కు రావడమేంటని ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. తన తదుపరి సినిమా కోసం మేకప్ వేసుకుంటున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వీరిద్దరూ హనీమూన్ టూర్ రద్దు చేసుకున్నట్లే అని అభిమానులు అంటున్నారు.
హీరోయిన్ సమంత తన సినిమా కెరీర్‌కు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందట. ఇటీవలే తన సొంత నిర్మాణ సంస్థను మొదలుపెట్టి అందులో 'శుభం' సినిమాను తెరకెక్కించింది. ఈ చిత్రం విడుదలయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు సామ్ ప్రధానపాత్రలో 'మా ఇంటి బంగారం' అనే సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసమే సమంత తన హనీమూన్ ట్రిప్‌ను రద్దు చేసుకున్నట్లు టాక్ నడుస్తోంది.
తమిళనాడు కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌కు చెందిన లింగ భైరవి ఆలయంలో డిసెంబర్ 1న సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. చాలా కొద్ది మంది సమక్షంలో ఈ పెళ్లి తంతు ముగిసింది. పెళ్లి అయిన తర్వాత అందుకు సంబంధించిన ఫొటోలను సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ సమయంలో వారిద్దరి గురించి రకరకాలైన వార్తలు వచ్చాయి.
ఖరీదైన పెళ్లి గిఫ్ట్..
అయితే పెళ్లైన తర్వాత హీరోయిన్ సమంతకు తన భర్త రాజ్ నిడిమోరు ఓ ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చాడట. తమ పెళ్లికి గుర్తుగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఏరియాలో రాజ్ నిడిమోరు ఓ ఖరీదైనా విల్లాను కొనుగోలు చేశాడని వార్తలు వచ్చాయి. అదే ఖరీదైన విల్లాను ఇప్పుడు సమంతకు పెళ్లి కానుకగా ఇచ్చాడని సమాచారం. ఆ గిఫ్ట్‌కు సమంత ఎంతో ఫిదా అయిపోయిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.
'ఫ్యామిలీ మ్యాన్' వెబ్‌సిరీస్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు ఇంతకు ముందు క్రియేటివ్ డైరెక్టర్, రచయిత డాక్టర్ శ్యామిలీ దేను 2015లో పెళ్లి చేసుకున్నాడు. అయితే వారిద్దరూ 2022లో విడాకులు తీసుకొని విడిపోయారు. అదే విధంగా హీరోయిన్ సమంత కూడా 2021లో హీరో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరూ కలిసి 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్‌సిరీస్‌కు కలిసి పనిచేశారు. అప్పుడు ఏర్పడిన పరిచయం ఇప్పుడు ప్రణయంగా మారిందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. 2025 ఏడాది ప్రారంభంలోనే రాజ్ నిడిమోరు, సమంత ప్రేమించుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై వారిద్దరూ స్పందించకపోయినా.. డిసెంబరు 1న వీరిద్దరూ పెళ్లి చేసుకోవడంతో అవి నిజం అయ్యాయి.
Also Read: Fact Check: ఆంజనేయ స్వామి ఆలయంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ?!..హరతి ఇస్తున్న వీడియో..అసలు నిజం ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook








