Samantha First Movie: 'పదిహేన్నేళ్ల కిందట నేను మొదటి సినిమా ఏమాయ చేశావేకు సంబంధించి అన్ని విషయాలు గుర్తున్నాయి. ఆ సినిమా ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సినిమాకు సంబంధించిన ప్రతిదీ నాకు గుర్తుంది' అని సమంత రూత్ ప్రభు తెలిపారు. ఈ సందర్భంగా ఆ సినిమా విషయాలు చెబుతూనే తన మాజీ భర్త నాగ చైతన్య పేరు ప్రస్తావించకుండా 'కార్తీక్‌ను గేటు దగ్గర కలిసే సీన్ నా ఫస్ట్ షాట్. అది బాగా గుర్తుంది. నాకు ప్రతి షాట్ గుర్తుంది' అంటూ సమంత వివరించారు.
Also Read: Sreeleela: బాయ్ ఫ్రెండ్ కుటుంబ వేడుకల్లో పాల్గొన్న శ్రీలీల.. వీడియో వైరల్..
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఏమాయ చేశావే సినిమా విడుదలై 15 ఏళ్లు పూర్తవడంతో ప్రత్యేకంగా మీడియాతో సమంత మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి కీలక విషయాలను పంచుకున్నారు. '15 ఏళ్లు అనేది చాలా ఎక్కువ సమయం. కొన్ని అంశాలు ఎప్పటికీ మర్చిపోను. కొన్ని పెద్దగా గుర్తులేవు' అంటూ సమంత వ్యాఖ్యానించారు. కొన్ని గుర్తు లేవు అంటే నాగ చైతన్యకు సంబంధించి కావొచ్చు అని చర్చ జరుగుతోంది. 'కెరీర్ ప్రారంభంలో నేను చేసిన సినిమాలను ఇప్పుడు చూస్తే చాలా దరిద్రంగా నటించినట్లు అనిపిస్తుంటుంది. వాటి నుంచే నేను పాఠాలు నేర్చుకున్నా. నాకు గురువు ఎవరూ లేరు' అని నాటి జ్ఞాపకాలను సమంత గుర్తుచేసుకున్నారు.
Also Read: OTT Movies: తండేల్, మనమే సహా ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
'నాకు భాష రాదు. పరిశ్రమలో స్నేహితులు, బంధువులు కూడా లేరు. అప్పుడు నాకు అన్నీ కొత్తే' అంటూ సమంత తెలిపారు. కెరీర్ ప్రారంభంలో గ్లామరస్ పాత్రలు చేయడానికి తనకు కష్టంగా ఉండేదని.. కానీ పరకాయ ప్రవేశం చేసేందుకు ప్రయత్నించేదానినని సమంత వివరించారు. ఆ సినిమాలు చూస్తే తనకు నవ్వు వస్తుందని పేర్కొన్నారు. తన తొలి సినిమా ఏమాయ చేశావే కాదని.. మాస్కో కావేరి తన తొలి సినిమా అని సమంత వెల్లడించారు. ఆ సినిమా పూర్తికాలేదని ప్రకటించారు.
దర్శకుడు గౌతమ్ మీనన్‌తో పనిచేయడం తనకు అద్భుతమైన అనుభూతి అని.. పాత్రలను ఎలా రూపొందించాలో ఆయనకు బాగా తెలుసు అంటూ సమంత ప్రశంసించారు. '15 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో ఎత్తుపల్లాలు. గెలుపు, ఓటములు, సమస్యలు ఇలా అన్నీ పలకరించాయి' అని తన పదిహేన్నేళ్ల జీవితాన్ని సమంత గుర్తుచేసుకున్నారు. 'వాటిని గుర్తుచేసుకుంటూ ఇప్పుడు రాబోయే 15 ఏళ్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని తెలిపారు. ఇప్పుడు తాను పరిణతితో ఉన్నట్లు.. తన బలాలు, బలహీనతలు అర్థం చేసుకున్నట్లు సమంత పేర్కొన్నారు. తన కెరీర్‌లోని ప్రతి దశను ఆస్వాదిస్తున్నట్లు చెప్పారు.
సినిమా చరిత్ర
ఏమాయే చేశావే సినిమా 25 ఫిబ్రవరి 2010లో విడుదలైంది. ఈ సినిమాకు దర్శకత్వం గౌతమ్ మీనన్, సంగీతం ఏఆర్ రహమాన్ అందించాడు. ఈ సినిమా మంచి టాక్‌తో భారీ విజయం అందుకుంది. కలెక్షన్లు కూడా భారీగా వచ్చాయి.
Just a glimpse of her vibrant cinematic excellence✨
Queen @Samanthaprabhu2 ?#SamanthaRuthPrabhu?#Samantha #SamanthaRuthPrabhu#15GloriousYearsOfSamantha pic.twitter.com/9bQUtcGvke— Samcults (@Samcults) February 25, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









