)
Samantha ruth prabhu and subham Movie Team visits Tirumala: కలియుగ దైవంతిరుమల వెంకటేశ్వరుడ్ని ప్రతి ఒక్కరు కొంగు బంగారంగా భావిస్తారు. అందుకే ఏ మంచి పనిజరిగిన కూడా తిరుమలలో వెంకటేశ్వర స్వామిని వెళ్లి చాలా మంది మొక్కులు తీర్చుకుంటారు. అందుకు తిరుమలలో రద్దీ మాత్రం ఎప్పుడు తక్కువగా ఉండు. భక్తులు కోట్లాదిగా తరలి వస్తునే ఉంటారు.
ఈ క్రమంలో తాజాగా.. సమంత తిరుమలకు వెళ్లారు. సామ్ ఇటీవల తన సొంత బ్యానర్ ట్రలాలా ను నిర్మించుకున్నారు.ఈ బ్యానర్ మీద శుభం తొలిసినిమా విడుదల తేదీని కూడా సమంత ప్రకటించేశారు. మే 9న ఈ మూవీ అభిమానుల ముందుకు రానుంది.
So pretty n simple, but her aura n vibe is mighty✨
Sam at Tirumala with Team of#Subham @Samanthaprabhu2 @TralalaPictures #Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/CIAb3fiXOG— AkaSam (@SammuVerse) April 19, 2025
అయితే.. ఈ మూవీ తన కెరియర్ లో సొంత బ్యానర్ పైన తొలి సినిమా కావడంతో హిట్ ను అందేలా ఆశీర్వాదించాలని సమంత తిరుమలకు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో సమంత టీమ్ ప్రత్యేకంగా వీఐపీ బ్రేక్ దర్శనంలో సమంత,శుభం మూవీ టీమ్ కు దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేశారు. మొత్తంగా సమంతను చూడగానే చాలా మంది సెల్పీలు దిగేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు సమంతకు, చిత్ర బృందానికి వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ క్రమంలో సమంత, శుభం చిత్రయూనిట్ ను ఈ మూవీని అందరు ఫ్యామిలీతో కలిసి తప్పకుండా చూడాలని కోరారు. మొత్తంగా సమంతకు ఈ మూవీ మాత్రం బిగ్ ఛాలెంజ్ అని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe