Ormax top 10 heroines 2025: ఆ మధ్యకాలంలో సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా.. ఇప్పుడు మళ్లీ హీరోయిన్స్ కి సైతం హీరోలా అంత ఫాలోయింగ్ ఉంటోంది. హీరోయిన్ ఫాన్స్ కూడా సోషల్ మీడియాలో వార్స్ జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఎవరు టాప్ వన్ లో నిలుస్తారు అని ఉత్సాహం అందరిలోనూ ఉంటోంది.
కాగా సరికొత్త సర్వేలో ఈసారి టాప్ 10 హీరోయిన్స్ మధ్యలో సమంత రుథ్ ప్రభు మొదటి స్థానంలో నిలవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం వలస సినిమాలతో ఏమ బిజీగా ఉంది రష్మిక. అంతేకాదు ఒకే సంవత్సరంలో దాదాపుగా 2000 కోట్ల వరకు ఈ హీరోయిన్ సినిమాలు సంపాదించాయి.
పుష్ప2.. యానిమల్.. చావా.. ఇలా వరుస విషయాలు అనుకుంటూ దూసుకుపోయింది ఈ హీరోయిన్. ఈ క్రమంలో తప్పకుండా రష్మిక మొదటి స్థానంలో ఉంటుంది అని అందరూ అంచనాలు వేశారు.
మరోపక్క సమంతకు.. గత సంవత్సరాలుగా తెలుగులో పెద్దగా సినిమాలు లేవు. కేవలం సిటాడెల్.. సిరీస్ లో మాత్రమే సమంత కనిపించింది. అయితే అలాంటి రష్మిక కన్నా సమంత మొదటి స్థానం పొందడం అందరిని ఆశ్చర్యపరస్తోంది.
ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రతి నెలా ఓ సర్వే నిర్వహించి, ప్రజల నుంచి వచ్చిన టాప్ హీరోయిన్ల ఓట్ల ఆధారంగా ఆ స్థానాలు నిర్ణయిస్తుంది. ఇక గత నెలలో సమంత టాప్ 10 హీరోయిన్స్ లో మొదటి స్థానం సంపాదించడం ఆమె అభిమానులను మాత్రం తెగ ఖుషి చేస్తోంది.
కొన్నేళ్ల క్రితం సమంతపై వచ్చిన కొన్ని రూమర్లు, ఆమె టాప్ ప్లేస్ పొందడానికి ప్రధాన కారణంగా నిలిచాయి అంటూ కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ హీరోయిన్ గత కొద్ది రోజుల నుంచి.. దర్శకుడు రాజ్ తో ప్రేమలో ఉండి అన్న విషయం వినిపిస్తూనే ఉంది. అయితే సమంతకు ఈ రూమర్లపై ఎలాంటి స్పందన లేదు.
ప్రస్తుతం సమంత సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించి అందులో ఒక సినిమా కూడా తీస్తోంది. "శుభం" అనే ఒక సినిమా తన నిర్మాణంలో రాబోతుంది. అలాగే, ఆమె మరిన్ని ప్రాజెక్టులకు సైన్ చేయాలని భావిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: Gold Rate: వామ్మో.. వాయ్యో.. లక్ష మార్క్‌ను టచ్ చేసిన బంగారం.. ధర ఇంకా పెరుగుతుందా?
Also Read: 500 Notes: ఆ రూ. 500నోట్లతో తస్మాత్ జాగ్రత్త.. హెచ్చరించిన హోంశాఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









