Samantha Subham OTT: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని.. నటనతోపాటు ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె మొదటి నిర్మాతగా రూపొందించిన సినిమా శుభం.. త్వరలోనే.. ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మధ్యనే ఈ చిత్రం టీజర్ విడుదలై అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ స్ట్రీమింగ్, శాటిలైట్ హక్కులపై ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది.
శుభం చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ హారర్ కామెడీ థ్రిల్లర్‌గా.. ఈ సినిమాను రూపొందించారు. ఆసక్తికరమైన కథ, వినూత్నమైన కథనంతో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు వస్తోంది.
ఈ సినిమాకు డిజిటల్ హక్కులు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 దక్కించుకుంది. అలాగే శాటిలైట్ హక్కులు కూడా జీ తెలుగు తీసుకుంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల.. తర్వాత శుభం మూవీ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే జీ తెలుగు చానెల్‌లో టెలికాస్ట్ కూడా జరగనుంది.
ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కు సంబంధించి బాగా డిమాండ్ ఏర్పడింది. అయితే డీల్ ఎంత మొత్తానికి జరిగిందన్న విషయాన్ని అధికారికంగా వెల్లడించకపోయినా, పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం సమంతకు నిర్మాతగా మంచి లాభాలు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా విడుదలకు ముందే సమంతకు గుడ్ న్యూస్ వచ్చేసింది అంత సంబరపడిపోతున్నారు అభిమానులు.
శుభం మూవీ ట్రైలర్ ఇప్పటికే విడుదల కాగా, దీనికి మంచి స్పందన లభించింది. ఫన్నీగా సాగిన కథ, భయాన్ని కలిగించే దృశ్యాలు, వినూత్నమైన కాన్సెప్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రోవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీతం క్లింటన్ సెరెజో అందించారు.
ఈ చిత్రంలో సమంత మాతాజీ పాత్రలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఆమె నటన ట్రైలర్‌కు మరింత ఆకర్షణగా నిలిచింది. సమంత పుట్టినరోజుకి కేవలం ఒకరోజు ముందు విడుదలైన ఈ ట్రైలర్ ఆమె అభిమానులను ఎంతగానో అలరించింది. ట్రైలర్‌లో భర్తలు ఎదుర్కొనే సున్నితమైన పరిస్థితులను హాస్యంగా చూపిస్తూ, దెయ్యాల కథనాన్ని వినూత్నంగా ప్రజెంట్ చేశారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి వసూళ్లు సాధిస్తే.. సమంతకు ఈ చిత్రం ద్వారా లాభాలే లాభాలుగా కనిపిస్తున్నాయి.
మరోపక్క సమంత మా ఇంటి బంగారం అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా కూడా ఆమె సొంత నిర్మాణ సంస్థ ద్వారానే నిర్మిస్తోంది. మరి ఈ చిత్రం కథ ఏమిటి అనేది తెలియాలి అంటే మాత్రం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
Also Read: Group 1 Posts: తెలంగాణ గ్రూప్-1 పోస్టుల భర్తీపై బిగ్ ట్విస్ట్.. రంగంలోకి కేంద్ర మంత్రి బండి సంజయ్
Also Read: Diesel Subsidy: ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్.. డీజిల్ ధరపై రూ.9 తగ్గింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









