Samantha: శుభం సినిమా ట్రైలర్ లో మాతాజీగా..సమంత ఎంట్రీ.. సర్ప్రైజ్ అదుర్స్ అంటున్న అభిమానులు…

Subham Trailer: టాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ.. ప్రత్యేక స్థానం సంపాదించుకుంది హీరోయిన్ సమంత. ఒకప్పుడు వరస సినిమాలో చేస్తూ ఏమో బిజీగా ఉన్న హీరోయిన్ ఈ మధ్య మాత్రం తన అనారోగ్య కారణం వల్ల చిత్రాలకు బ్రేక్ ఇచ్చింది.   

Written by - Vishnupriya | Last Updated : Apr 27, 2025, 02:03 PM IST
Samantha: శుభం సినిమా ట్రైలర్ లో  మాతాజీగా..సమంత ఎంట్రీ.. సర్ప్రైజ్ అదుర్స్ అంటున్న అభిమానులు…

Samantha as Mathaji: ఇక ఈ మధ్య కోలుకున్న ఈ నటి మళ్ళీ సినిమాలతో బిజీ అవ్వడానికి చూస్తోంది. అయితే హీరోయిన్ గానే కాకుండా.. సమంత రూత్ ప్రభు కొత్త అవతారమెత్తింది. ఈ క్రమంలో సమంత..ఈసారి కథానాయికగా కాదు, నిర్మాతగా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పతాకంపై ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ మే 9న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో, తాజాగా విడుదల చేసిన ట్రైలర్ మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.

Add Zee News as a Preferred Source

‘శుభం’ ట్రైలర్‌ని పరిశీలిస్తే, ఓ ఊరిలో మహిళలంతా సీరియల్స్ చూస్తూ విచిత్రంగా ప్రవర్తించడం, పురుషులు భయంతో పరుగులు పెట్టడం వంటి హాస్య రసాన్ని ప్రతిబింబించే సన్నివేశాలు కనిపించాయి. అదే సమయంలో హారర్ అంశాలను చక్కగా మిళితం చేశారు. ట్రైలర్‌లో చివర్లో సమంత మాతాజీ గెటప్‌లో చేసిన స్పెషల్ అప్పియరెన్స్ ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తిని పెంచింది. సర్ప్రైజ్ అదుర్స్ అంటూ సమంత అభిమానులు సోషల్ మీడియా మొత్తం.. సమంత మాతాజీ వేషంలో ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఈ చిత్రం టీజర్ విడుదలైనప్పటినుంచి ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో సమంతా కూడా కనిపిస్తుంది అనగానే.. ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు పెరిగాయి. 

ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. క్లింటన్ సెరెజో సంగీతం, వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. 

సినిమాలో హాస్యం, హారర్, ఉత్కంఠ, భావోద్వేగాలు అన్నీ సమపాళ్లలో ఉంటాయని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. సమంత నిర్మాతగా మొదటి ప్రయత్నమే అయినా, మంచి కంటెంట్‌ను ఎంపిక చేసుకోవడం విశేషం. ఇప్పటికే కథానాయికగా తన ప్రతిభను నిరూపించుకున్న సమంత, ఇప్పుడు నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ క్రమంలో శుభం సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 9న విడుదల కానున్న ఈ చిత్రం.. సమంత కొత్త ప్రయాణానికి విజయపథం కావాలని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. ఇక త్వరలోనే సమంత మా ఇంటి బంగారం అనే చిత్రంలో హీరోయిన్ గా కూడా కనిపించనుంది. ఈ సినిమా కూడా సమంతనే నిర్మించడం విశేషం.

Also Read: AP Bars: మందుబాబుకు జాక్‌పాట్‌.. భారీగా ధరలు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం

Also Read: Anant Ambani: కొత్త జీవితంలోకి ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

 

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News