Samantha visits Tirumala with raj nidimoru video: సమంత రాజ్ నిడిమోరు, శుభం మూవీ టీమ్ తో కలిసి తిరుమలకు వెళ్లారు . అక్కడ శ్రీవారికి ప్రత్యేకంగా మొక్కులు కూడా తీర్చుకున్నారు. ఇదిలా ఉండగా.. తిరుమలలో అంతకు ముందు సమంత.. టీటీడీ డిక్లరేషన్ పై సంతకం పెట్టారు. అంతేకాకుండా.. సమంత తిరుమలలో దర్శనం చేసుకుంటుండగా.. రాజ్ నిడిమోరు కూడా అక్కడే కన్పించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
గత కొన్ని రోజులుగా వీరి మధ్య పెళ్లి వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో వీరిద్దరు చాలా క్లోజ్ గా తిరుమలకు రావడం వీరి పెళ్లికి మరింత బలాన్నిచేకూర్చేదిగా మారింది. అయితే.. మొత్తంగా సమంత పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో బలంగా వైరల్ అవుతున్నాయి. ఇంకా ఎన్ని సార్లు తమను వెర్రోళ్లు చేస్తారని కొంత మంది అభిమానులు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
సమంత.. గతంలో కూడా పలు మార్లు రాజ్ నిడిమోరుతో పలుఈవెంట్ లలో పాల్గొన్నారు. చాలా చనువుగా కూడా ఉన్నారు.ఈ క్రమంలో ఇటీవల సామ్.. ట్రలాలా అనే సొంత బ్యానర్ పై శుభంమూవీని తీశారు.ఈ మూవీ మే 9న అభిమానుల ముందుకు రానుంది. ఇది చాలా ఫన్నీ హర్రర్ లా ఉంటుందని ఇప్పటికే మూవీ టీమ్ వెల్లడించారు.
ఈ మూవీని చూసినంద సేపు చాలా ఎంజాయ్ చేస్తారని కూడా మూవీ టీమ్ చెప్పుకొచ్చారు. అయితే.. ప్రస్తుతం సమంత మరోసారి రాజ్ నిడిమోరు కలిసి శ్రీవారిని దర్శించుకొవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారింది.
ఇంకా తొందరగా గుడ్ న్యూస్ చెప్పండని కూడా సామ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. తిరుమల దర్శనం తర్వాత సమంత తన మూవీ టీమ్ తో కలిసి శ్రీకాళహస్తీకి కూడా వెళ్లారు.అక్కడ కూడా ప్రత్యేకంగా పూజలు చేయించుకుని మొక్కులు తీర్చుకున్నారు.









