Odela 2 Event: తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన 'ఓదెల 2' ఏప్రిల్ 17న థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా, సూపర్ నాచురల్ థ్రిల్లర్ గా రూపొందింది. అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 'ఓదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్.
ఈ సినిమాలో తమన్నా భాటియా నాగ సాధువు పాత్రలో కనిపించనున్నారు. హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు విభిన్న అనుభూతిని కలిగించనుంది అని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు సినిమా యూనిట్. టీజర్ రిలీజైనప్పటి నుంచి సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ అయింది.
ఈ క్రమంలో ఈరోజు ఈ సినిమా ఈవెంట్ ఘనంగా జరిగింది. తమన్నాతో రచ్చ సినిమా తీసిన దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాని నిర్మిస్తూ ఉండగా.. ఈ ఈవెంట్ లో ఆమె గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ సినిమా కథ గురించి కూడా చెప్పుకొచ్చారు.
ఈ ఈవెంట్లో సంపత్ నంది మాట్లాడుతూ..”ఈ సినిమా టీజర్ కి మంచి స్పందన వచ్చింది. ఇందుకు కారణం మీడియా, ప్రేక్షకులు, లార్డ్ శివ. ఈ సినిమా గురించి మంచి మాటలు రాసిన మీడియా వారందరికీ కూడా నా ధన్యవాదాలు. ఓదెల సినిమా నాకు చాలా ఎమోషనల్. ఈ సినిమా కథ జరిగిన ఊర్లో పుట్టి పెరిగాను. అందుకే చాలా గౌరవంతో, అలానే ప్రేమతో ఈ సినిమాని రాసి తీయడం జరిగింది. సాధారణంగా ఏదైనా కాపాడేది ఆ ఊర్లో ఉన్న ఇలవేల్పు దేవుడి గుడి. ఒక లైన్ లో చెప్పాలంటే.. ఓదెల విలేజ్ లో ఒక కష్టం వస్తే..ఆ కష్టం పెద్దదైనప్పుడు.. ఆ ఊరిలో ఉన్న ఓదెల మల్లన్న నాగ సాధు క్యారెక్టర్ ద్వారా ఎలా పరిష్కారం దొరికింది అనేది ఈ సినిమా కథ. ఈ సినిమాలో కంటెంట్, స్క్రీన్ ప్లే, విజువల్ వండర్ గా ఉంటాయి. విజువల్స్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఏప్రిల్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది,” అని చెప్పుకొచ్చారు.
ఆ తరువాత తమన్నా గురించి మాట్లాడుతూ..” భైరవి పాత్రలో తమన్నా చాలా అద్భుతంగా నటించారు. ఈ పాత్ర తమన్నా కోసమే పుట్టింది అనేలా ఆమె నటించాడు. 20 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో తమన్నా ఎంతో డెడికేషన్ తో కొనసాగుతోంది. ఇది సాధారణమైన జర్నీ కాదు. నేను పదేళ్ల క్రితం ఏ డెడికేషన్ తనలో చూశానో.. ఇప్పుడు కూడా మళ్లీ అదే డెడికేషన్ తనలో ఉంది. అందుకే ట్వంటీ ఇయర్స్ గా టాప్ చైర్ లో తమన్నా కూర్చుని ఉంది. తను లేడీ సూపర్ స్టార్ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ అనిపిస్తుంది,” అని చెప్పుకున్నారు. ఇక ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.








