Sammelanam Web Series: ఓటీటీలో దూసుకుపోతున్న సమ్మేళనం వెబ్‌సిరీస్.. టాప్‌లో ట్రెండింగ్

Sammelanam Web Series: ఈటీవీ విన్‌లో సమ్మేళనం వెబ్‌ సిరీస్‌ దూసుకుపోతుంది. ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్‌ సిరీస్‌ ఇప్పటివరకు ఇప్పటివరకు 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ సాధించి టాప్‌లో ట్రెండ్ అవుతోంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Mar 1, 2025, 01:58 PM IST
Sammelanam Web Series: ఓటీటీలో దూసుకుపోతున్న సమ్మేళనం వెబ్‌సిరీస్.. టాప్‌లో ట్రెండింగ్

Sammelanam Web Series: రొమాంటిక్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన వెబ్‌ సిరీస్ సమ్మేళనం. ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్‌ సిరీస్‌ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. లవ్, ఫ్రెండ్‌షిప్, బ్రేకప్‌లతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను అలరిస్తోంది. తరుణ్ మహదేవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్‌లో ప్రియ వడ్లమాని, గానాదిత్య, వినయ్ అభిషేక్ కీలక పాత్రల్లో నటించారు. సునయని.బి, సాకెత్.జె సంయుక్తంగా నిర్మించారు. అందరూ కొత్త నటీనటులతో రూపొందించినా.. సున్నితమైన అంశాలను జోడించి ఆడియన్స్‌ను మెప్పించడంలో తరుణ్‌ మహదేవ్ సక్సెస్ అయ్యారు. 

Add Zee News as a Preferred Source

ఎలాంటి అడల్ట్ కామెడీ, అడల్ట్ సీన్స్ లేకుండా.. కుటుంబం అంతా కలిసి కూర్చుని చూసేలా తెరకెక్కించారు. మూడో ఎపిసోడ్ నుంచి కథ పరుగులు పెడుతున్నట్లు అనిపిస్తుంది. శ్రావణ్ జీ కుమార్ విజువల్స్, శరవణ వాసుదేవన్, యశ్వంత్ నాగ్ అందించిన మ్యూజిక్ ఈ వెబ్‌ సిరీస్‌కు మరింత ప్లస్ అయింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది. ఈటీవీ విన్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతున్న సమ్మేళనం వెబ్ సిరీస్‌.. ఇప్పటివరకు 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ సాధించింది.

స్టోరీ ఏంటంటే..?

రామ్ (గణాదిత్య) రచయితగా ఉంటాడు. ఆయన రాసిన పుస్తకానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్ని పత్రికల్లో రామ్ గురించి.. పుస్తకం గురించి గొప్పగా రాస్తారు. ఈ ఆర్టికల్ చదివి రామ్‌ నుంచి విడిపోయిన స్నేహితులు శ్రేయ (బిందు నూతక్కి), రాహుల్ (శ్రీకాంత్ యాచమనేని), అర్జున్ (విజ్ఞయ్ అభిషేక్), ప్రేమించిన అమ్మాయి మేఘన (ప్రియా వడ్లమాని) ఆయనను కలవాలని వస్తారు. వీళ్లను కలిసేందుకు రామ్ ఇష్టపడ్డాడా..? రామ్, అర్జున్ ప్రేమించిన మేఘన.. ఇద్దరిలో ఎవరి ప్రేమను ఒప్పుకుంది..? ఆమె గతం ఏంటి..? స్నేహితులు అందరూ ఎందుకు వీడిపోయారు..? అనే విషయాలు తెలియాలంటే సమ్మేళనం వెబ్ సిరీస్‌ చూడాల్సిందే.

Also Read: Ramadan Importance: రంజాన్ ప్రాముఖ్యత ఏంటి, ఉపవాసాలు ఎందుకు ఉంటారు

Also Read: Kannappa Teaser: కన్నప్ప టీజర్‌.. ప్రభాస్ లుక్‌ హైలెట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News