Sodara Release date: సంపూర్ణేష్ బాబు.. ఈ సారి అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో 'సోదరా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు,చ సంజోష్ అన్నదమ్ములుగా నటించారు. ఈ చిత్రంలో ప్రాచీ బంసాల్, ఆరతి గుప్తా కథానాయికలుగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అంతేకాదు ఏప్రిల్ 11న ఈ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
మన్ మోహన్ మేనం పల్లి డైరెక్ట్ చేశారు. క్యాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చంద్ర చగంలా ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ అన్నదమ్ముల బంధం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. అలాంటి అన్నదమ్ముల బంధాన్నిసిల్వర్ స్క్రీన్ పై మరోసారి కొత్తగా చూపించబోతున్నట్టు చెప్పారు.
ఇంతకు ముందు ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు నాలుగు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చాయి. తెలుగు చిత్రసీమలో ఎందరో సోదరులు ఉన్నారు అలాంటి సోదరులందరినీ బంధాన్ని అద్దం పట్టేలా మా ఈ సోదరా మూవీ ఉంటుందని చెప్పారు. తప్పకుండా మా సోదరా చిత్రం ఈ వేసవికి ఆడయిన్స్ ను ఎంటర్‌టైన్ చేస్తుందనే ఆషాభావం వ్యక్తం చేశారు.
నిర్మాత మాట్లాడుతూ '' సంపూర్ణేష్ బాబు నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్న ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఆయనలోని మరో కోణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నారు. తప్పకుండా ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









