Allu Arjun: పోలీసులకు షాక్ ఇచ్చిన సంధ్యా థియేటర్ యాజమాన్యం.. మరి అరెస్టు వెనక కారణం..?

Allu Arjun Arrest Update: అల్లు అర్జున్ ,సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం పుష్ప 2. భారీ అంచనాల మధ్య  విడుదలై ఊహించని సక్సెస్ ను  అందుకుంది.విడుదలైన వారంలోపే రూ .1000 కోట్ల క్లబ్లో చేరి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.  

Written by - Vishnupriya | Last Updated : Dec 13, 2024, 04:12 PM IST
Allu Arjun: పోలీసులకు షాక్ ఇచ్చిన సంధ్యా థియేటర్ యాజమాన్యం.. మరి అరెస్టు వెనక కారణం..?

Sandhya Theatre about Allu Arjun Issue: అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం పుష్ప2. విడుదలైన వారంలోపే రూ.1000 కోట్ల క్లబ్లో  చేరింది. కానీ ఆ సంతోషం ఒక్కరోజు కూడా లేకుండా పోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా అల్లు అర్జున్ డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో వేసిన బెనిఫిట్ షో కి అభిమానులతో కలిసి చూడాలని సినిమా థియేటర్ కి వచ్చారు. అయితే అక్కడికి అల్లు అర్జున్ రావడంతో ఆయనను చూడడానికి అభిమానులు ఎగబడ్డారు.

Add Zee News as a Preferred Source

ఆ తొక్కిసలాటలో సినిమా చూడడానికి వచ్చిన రేవతి అనే 39 సంవత్సరాల మహిళ అక్కడికక్కడే మరణించగా ఆమె కొడుకు స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆ బాలుడిని హాస్పిటల్ కి తరలించగా ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

ఇకపోతే మొదటి రోజే మహిళ మృతి చెందడంతో అల్లు అర్జున్ పై , సంధ్య థియేటర్ యాజమాన్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ లాంటి పబ్లిక్ ఫిగర్..పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ఎలా పబ్లిక్ లోకి వస్తారు ?అంటూ విమర్శలు గుప్పించారు.

దీనికి తోడు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా.. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు వస్తున్నప్పుడు ఎంత జాగ్రత్త తీసుకోవాలి.. ముందే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా..అంటూ కూడా కామెంట్ లు చేశారు. అయితే ఎందుకో ఈ విషయాలు ఇంతగా వైరల్ అవుతున్నా అప్పుడు సంధ్య థియేటర్ యాజమాన్యం స్పందించలేదు.

కానీ ఇప్పుడు అల్లు అర్జున్ ని ఇదే కేసులో అరెస్ట్ చేయడంతో ఎట్టకేలకు అసలు విషయాన్నీ బయటపెట్టింది సంధ్యా థియేటర్ యాజమాన్యం. హైదరాబాదులోని పోలీస్ కమిషనర్ ఆఫీస్ కు డిసెంబర్ రెండవ తేదీని వినతి పత్రం పంపింది. డిసెంబర్ 4 5వ తేదీలలో బెనిఫిట్ షోలతో పాటు షో కూడా వేయబోతున్నాము. ఈ థియేటర్ కి హీరో అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక మందన్న అలాగే పలువురు సెలబ్రిటీలు కూడా హాజరు కాబోతున్నారు.

క్రౌడ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నామంటూ ఒక లేఖ కూడా పంపించినట్లు తాజాగా మీడియాకు రివీల్ చేసింది సంధ్య థియేటర్ యాజమాన్యందీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు.  మరి లేఖ పంపిన కూడా ఎందుకు కమిషనర్ స్పందించలేదు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీని వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా అనే కోణంలో చర్చిస్తున్నారు.

ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News