Sankranthiki Vasthunnam OTT cum World Television Premier: టాలీవుడ్ సీనియర్ హీరో 60 ప్లస్ ఏజ్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసారు. 2014లో సోలో హీరోగా ‘దృశ్యం’ మూవీతో హిట్ అందుకున్న వెంకటేష్.. దాదాపు 11 యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత సోలో హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో హిట్ అనేకంటే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. హీరోగా వెంకటేష్ పనై పోయిందనుకున్న వారికీ ఈ సినిమాతో గట్టి సమాధానమే ఇచ్చారు. తెలుగు సీనియర్ హీరోల్లో వరుసగా మల్టీస్టారర్స్ చేస్తోన్న వెంకటేష్.. సోలో హీరోగా హిట్ కొట్టడం అసాధ్యమన్న వాళ్లకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బంపర్ హిట్ అందుకున్నాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కంటే ముందు ‘ఓరి దేవుడా’ తో పాటు హిందీలో సల్మాన్ తో కలిసి ‘కిసి కా భాయి కిసీ కా జాన్’ సినిమాలో సెకండ్ కథానాయకుడిగా నటించారు. ఇక ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు సక్సెస్ అయినా.. అందులో మెగా హీరో వరుణ్ తేజ్ కు క్రెడిట్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత సోలో హీరోగా వెంకటేష్ నటించిన ‘సైంధవ్’ మూవీ కనీస ఓపెనింగ్స్ దక్కించుకోలేదు.
అంతకు ముందు చేసిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ తో వెంకీమామను తిట్టిపోసిన వాళ్లు ఉన్నారు. ఈ బూతూ వెబ్ సిరీస్ చేయాల్సిన అవసరం వెంకీమామకు ఏమోచ్చిందనే కామెంట్స్ కూడా వినబడ్డాయి. ఈ సినిమా 2025లో తెలుగులోనే కాదు.. భారత దేశంలోనే తొలి హిట్ అందుకున్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇక వెంకటేష్ మెయిన్ హీరో కంటే సెకండ్ హీరోగానే చేసుకోవాలి అని చెప్పిన నోళ్లకు ఈ సినిమా సక్సెస్ తో నోటికి తాళం వేసారు. అంతేకాదు ఇప్పటి వరకు సంక్రాంతి సినిమాల్లో ‘అల వైకుంఠపురములో’ తో పాటు ప్యాన్ ఇండియా సంక్రాంతి చిత్రాల్లో హనుమాన్ మూవీలను దాటేసి టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన తెలుగు ఫస్ట్ సీనియర్ హీరోగా నిలిచారు. మొత్తంగా నాన్ ప్యాన్ ఇండియా కేటగిరిలో సంక్రాంతి సీజన్ లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసారు. తాజాగా ఈ చిత్రాన్ని ఒకేసారి జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మార్చి 1న జీ తెలుగులో టెలికాస్ట్ కానుంది. ఈ సందర్భంగా అఫీషియల్ ప్రకటన విడుదల చేసారు.
మొత్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ ఇమేజ్ ఫ్యామిలీ ఆడియన్స్ లో ఏ మాత్రం చెక్కు చెదరలేదనే విషయం మరోసారి ప్రూవ్ అయింది. అంతేకాదు తెలుగులో సీనియర్ టాప్ స్టార్ అయిన చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, సైరా నరసింహారెడ్డి సినిమాల లైఫ్ టైమ్ వసూళ్లను దాటేసి సీనియర్ టాప్ స్టార్ హీరోల్లో తెలుగులో నెంబర్ వన్ గా నిలిచారు వెంకటేష్. అంతేకాదు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో వెంకటేష్ ..60 యేళ్ల పై బడిన ఏజ్ లో దాదాపు రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన కథానాయకుడిగా రికార్డు క్రియేట్ చేసారు. రజినీకాత్..2.O, జైలర్ సినిమాలతో రూ. 700 కోట్లు.. రూ. 600 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధిస్తే..అటు కమల్ హాసన్.. విక్రమ్ సినిమాతో రూ. 400 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన సీనియర్స్ స్టార్స్ గా నిలిచారు. అటు చిరంజీవి సైరా తో రూ. 240 కోట్ల దగ్గరే ఆగిపోయారు. మొత్తంగా తెలుగులో చిరంజీవి ని బీట్ చేసి రజినీకాంత్, కమల్ హసన్ ల సరసన చేరారు వెంకటేష్. 60 ప్లస్ ఏజ్ లో రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సీనియర్ హీరోగా తన పేరిట క్రియేట్ చేశారు.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









