Sankranthiki Vasthunnam Ott Responce: అవును గత కొన్నేళ్లుగా హిస్టరీలో ఎన్నడు చూడని సంఘటన .. తాజాగా వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైన ఒక గంట వ్యవధిలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అయితే ఓటీటీ వేదికగా ఈ సినిమా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఈ సినిమా ప్రసారమైన 12 గంటల్లోనే 100 మిలియన్ వన్ మినిట్ వాచ్ టైమ్ ను సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది. సంక్రాంతి వస్తున్నాం మూవీ 2025 సంక్రాంతి పోటీలో చివరగా విడుదలైన సంచలన విజయం సాధించింది. థియేట్రికల్ గా ఈ సినిమా రూ. 300 కోట్ల కు పైగా గ్రాస్ వసూల్లతో సంచలనం సృష్టించింది. అంతేకాదు రూ. 160 కోట్ల కు షేర్ తో సంచలనం రేపింది. అంతేకాదు తెలుగులో సీనియర్ హీరోల్లో ఈ రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేసిన హీరో లేరు. ఇక వెంకటేష్.. గత సినిమా ‘సైంధవ్’ మూవీ టోటల్ రన్ లో కనీసం రూ. 10 కోట్ల షేర్ కూడా రాబట్టలేదు.
అలాంటిది 2025 పొంగల్ పోటీలో విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూల్లతో సంచలనం సృష్టించడం మాములు విషయం కాదు. మొత్తంగా 60 ప్లస్ ఏజ్ లో వెంకీ ఈ రికార్డు క్రియేట్ చేయడం మాములు విషయం కాదు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
2014లో సోలో హీరోగా ‘దృశ్యం’ చిత్రంతో సక్సెస్ అందుకున్న వెంకటేష్.. దాదాపు 11 యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత సింగిల్ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో హిట్ అనేకంటే బ్లాక్ బస్టర్ బాప్ గా నిలిచారు. హీరోగా వెంకటేష్ ఖేల్ ఖతం అన్న వాళ్లకు ఈ సినిమాతో గట్టిగా ఇచ్చి పడేసాడు. తెలుగు సీనియర్ హీరోల్లో వరుసగా మల్టీస్టారర్స్ చేస్తోన్న వెంకటేష్.. సోలో హీరోగా హిట్ కొట్టడం ఇంపాజిబుల్ అన్న వాళ్లకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బంపర్ హిట్ కొట్టి అందరు మూళ్లు మూయించారు. ఈ సినిమా 2025లో తెలుగులోనే కాదు.. భారత దేశంలోనే తొలి హిట్ అందుకున్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు థియేట్రికల్ గా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీ వేదికగా బ్లాక్ బస్టర్ గా నిలవడం మాములు విషయం కాదు. మొత్తంగా తెలుగులో చిరంజీవి ని బీట్ చేసి రజినీకాంత్, కమల్ హసన్ ల సరసన చేరారు వెంకటేష్. 60 ప్లస్ ఏజ్ లో రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సీనియర్ హీరోగా తన పేరిట క్రియేట్ చేశారు.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









