నటీనటులు: సప్తగిరి, ప్రియాంక శర్మ, వడ్లమాని శ్రీనివాస్, మురళీ గౌడ్, ప్రమోదిని, రోహిణి, తదితరులు..
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సుజాత సిద్దార్థ్
ఎడిటర్: మధు
సంగీతం: శేఖర్ చంద్ర
నిర్మాతలు: K.Y.బాబు (విజన్ గ్రూప్), భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల
బ్యానర్: థామ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్
సమర్పణ: చాగంటి సినిమాటిక్ వరల్డ్
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: అభిలాష్ రెడ్డి గోపిడి
వెంకటేష్ హీరోగా విజయ్ భాస్కర్ దర్శకత్వంలో త్రివిక్రమ్ మాటలు అందించిన ‘మల్లీశ్వరి’లో హీరో పేరు ప్రసాద్. ఏజ్ బార్ అయినా.. పెళ్లి కాకపోవడంతో అందరు పెళ్లి కాని ప్రసాద్ అని సంభోదిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తెలుగులో అల్లరి నరేష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కింది. ఇపుడు చాలా కాలం తర్వాత సప్తగిరి లీడ్ రోల్లో యాక్ట్ చేసిన చిత్రం ‘పెళ్లి కాని ప్రసాద్’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
పెళ్లి కాని ప్రసాద్ కథ:
ప్రసాద్ (సప్తగిరి) మలేషియాలో ఒక స్టార్ హోటల్ లో పని చేస్తూ ఉంటాడు. 38 ఏళ్ల ఏజ్ తన తండ్రి (మురళీధర్) తమ పూర్వీకుల కట్నం హిస్టరీ చెప్పి రూ. 2 కోట్లు తక్కువైతే పెళ్ళి చేసుకోకూడదు అని చెప్పిన మాటలు ఒంట పట్టించుకొని .. సంబంధాల మీద సంబంధాలు చూస్తూనే ఉంటాడు. అలాంటి సమయంలో ప్రియ (ప్రియాంక శర్మ) ప్రసాద్ కు పరిచయం ఏర్పడుతుంది. అది ప్రేమగా మారుతుంది. మాడ్రన్ థాట్స్ ఉన్న ఈ అమ్మాయి తన పేరేంట్స్, అమ్మమ్మతో కలిసి విదేశాల్లో సెటిల్ కావాలనుకుంటుంది. ఈ క్రమంలో ప్రసాద్ ను పెళ్లి చేసుకుంటుంది. అయితే ప్రసాద్ విదేశాలకు వెళ్ల కూడదనే అనుకున్న సమయంలో ఇద్దరూ పెద్దగా గొడవ పడతారు. ప్రసాద్ ఫారెన్ ఎందుకు వెళ్ల కూడదనకున్నాడు. దీని వెనక బలమైన కారణం ఏంటి..? పెళ్లి కాని ప్రసాద్ పెళ్లైకా ఎలాంటి కష్టాలను ఫేస్ చేసాడు.. ? ఈ క్రమంలో ఏం జరిగిందనేదే ఈ సినిమా స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
పెళ్లి కాని ప్రసాద్ అనే టైటిల్ తోనే ఈ సినిమా ఎలా ఉండబోతుందో దర్శకుడు చెప్పేశాడు. ఏజ్ బార్ అవుతున్న పెళ్లి కాని ప్రసాద్ టైపు అంకుల్స్ మన సమాజంలో ఎక్కువ మందే ఉన్నారు. ఇలాంటి పాత్రతో చాలా మంది కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. పెళ్లి కాకుండా ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేస్తోన్న కుర్రాడిని మ్యారేజ్ చేసుకొని ఫారెన్ లో సెటిల్ అవ్వాలనుకున్న అమ్మాయికి అతను ఫారెన్ వెళ్లడు అని తెలిసిన తర్వాత ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేసింది. మొత్తంగా మన సమాజంంలో పెళ్లి పేరిట జరుగుతన్న కొన్ని మోసాలను ఇతివృత్తాలను ఈ సినిమాలో చక్కగా ప్రెజెంట్ చేశాడు.మొత్తంగా మెసేజ్ లాంటి జోలికి పోకుండా.. ఎంతో క్యాజువల్ గా ముగించడం కాస్త వెలతిగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ను ఇంకాస్త బెటర్ గా రాసుకుంటే బాగుండేది. మొత్తంగా సినిమా కొచ్చే ప్రేక్షకులను నవ్వించడమే పనిగా పెట్టుకున్నాడు. దర్శకుడు శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల విషయానికొస్తే..
సప్తగిరి కామెడీ టైమింగ్ గురించి పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. సినిమా మొత్తాన్ని తనదైన నటనతో కామెడీతో ఎక్కడా ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా చేశాడు. వయసైపోతున్న పెళ్లి కాని అబ్బాయి పాత్రలో మరోవైపు తండ్రిని ఎదురించలేని కుమారుడు పాత్రలో సప్తగిరి యాక్టింగ్ బాగుంది. స్వార్థపరులారైన సగటు అమ్మాయి పాత్రలో ప్రియాంక నటన ఆకట్టుకుంటుంది. మురళీ గౌడ్ నటన.. మిగిలిన నటీనటుల తమ పరిధి మేరకు మెప్పించారు.
పంచ్ లైన్.. కష్టాలతో నవ్వించే ‘పెళ్లి కాని ప్రసాద్’..
రేటింగ్: 3/5
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









