)
Sara Tendulkar: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ పేరు చెప్పగానే సామాజిక మాధ్యమాల్లో ఈమె పేరే ఓ సంచలనం. తరచుగా తన వ్యక్తిగతంతో పాటు వృత్తికి సంబంధించిన సమాచారాన్ని పంచుకునే సారా.. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోతో అభిమానుల్లో సంచలనం సృష్టించింది. సారా నిజంగానే నిశ్చితార్థం చేసుకుందా? అని మీడియాతో పాటు నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. అయితే, నిజం తెలిసిన తర్వాతే అభిమానులందరూ ఊపిరి పీల్చుకున్నారు
సారా టెండూల్కర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన 'నిశ్చితార్థం' ఫోటో నిజానికి ఆమెది కాదట. సారా తన సన్నిహితురాలు మల్లికా సరుప్రియ నిశ్చితార్థ వేడుకకు అటెంట్ అయ్యారు. సారా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో త్వరలో పెళ్లి చేసుకోబోతున్న మల్లికా, సోహమ్ అగర్వాల్ ఫోటోలను షేర్ చేసింది.
సారా టెండూల్కర్ అంద చందాల విషయానికొస్తే.. బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఈమె గ్లామర్ ముందు దిగదుడుపే అని చెప్పాలి. సారా తన స్నేహితులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. మల్లిక చాలా యేళ్లుగా సారాకు స్నేహితురాలు. ఇరు కుటుంబాల మధ్య మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరూ తరచుగా ట్రిప్‌లలో పార్టీలలో కలిసి కనిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తన స్నేహితురాలి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని సారా ఈ ఫోటోలను షేర్ చేసింది. సారా స్నేహితురాలి నిశ్చితార్థ ఫోటోలు వైరల్ కావడంతో, నెటిజన్ల దృష్టి మరోసారి సారా టెండూల్కర్ ఎప్పుడు వివాహం చేసుకుంటారనే ప్రశ్న మొదలైంది. సోషల్ మీడియాలో సారాకు ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. ఆమె పలువురితో డేటింగ్ చేస్తోన్న వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో సారా యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌తో డేటింగ్ చేస్తున్నట్లు ఒక పుకారు వచ్చింది. దాన్ని ఇద్దరు ఖండించారు. తాజాగా సారా బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేదితో పీకలోతు ప్రేమలో ఉందనే వార్త షికారు చేస్తోంది. దీనిపై సారానే క్లారిటీ చేస్తే బాగుంటుందని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook