Tribandhari Barbarik: త్రిబాణధారి బార్బారిక్‌ ప్రమోషన్స్‌లో సత్యరాజ్ జోరు.. కథ పైన నమ్మకంతోనే..!

Tribandhari Barbarik: త్రిబాణధారి బార్బారిక్‌ సినిమా ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగా 'అనగా అనగా కథలా' పాటకు సత్యరాజ్‌ చేసిన రీల్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ పాటతో తాత-మనవరాల మధ్య బంధాన్ని చూపించారు. మరింత వివరాల్లోకి వెళితే...

Written by - Vishnupriya | Last Updated : Apr 13, 2025, 07:37 PM IST
Tribandhari Barbarik: త్రిబాణధారి బార్బారిక్‌ ప్రమోషన్స్‌లో సత్యరాజ్ జోరు.. కథ పైన నమ్మకంతోనే..!

Tribandhari Barbarik update: బాహుబలి సినిమాతో కట్టప్పగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సీనియర్ నటుడు సత్యరాజ్ తాజాగా మరో ఆసక్తికర పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం త్రిబాణధారి బార్బారిక్‌. ఈ సినిమాపై నమ్మకంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో సత్యరాజ్ స్పీడు పెంచారు.

Add Zee News as a Preferred Source

వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిదాల నిర్మించిన ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు మారుతి ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటివరకు విడుదలైన టీజర్, పాటలు, గ్లింప్స్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొల్పాయి.

ఇటీవల విడుదలైన ‘అనగా అనగా కథలా’ పాట యూట్యూబ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాత మరియు మనవరాల మధ్య ఉండే అనుబంధాన్ని స్పష్టంగా చూపించిన ఈ పాటపై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ పాట ప్రమోషన్స్‌లో భాగంగా సత్యరాజ్ కూడా రీల్స్ చేస్తూ యువతను ఆకట్టుకుంటున్నారు. ఆయన పాల్గొనడం సినిమాపై ఉన్న నమ్మకానికి నిదర్శనంగా మారింది.

ఈ చిత్రంలో సత్యరాజ్‌తో పాటు సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రొమాన్స్, ఎమోషన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కుతున్నట్టు టీం చెబుతోంది.

త్వరలోనే సినిమా విడుదల తేదీని మేకర్లు ప్రకటించనున్నారు. సత్యరాజ్ ఈ తరహా ప్రమోషన్స్‌లో పాల్గొనడం అనేది కుర్ర నటులకు సైతం ప్రేరణ కలిగించే అంశంగా మారింది. సినిమా హిట్టవ్వాలన్న ఆశయంతో సీనియర్ నటుడిగా ఆయన చేసే ప్రయత్నం అభిమానులను ఆకట్టుకుంటోంది.

Also Read: Rajiv Yuva Vikasam: లాభాలు వచ్చే వ్యాపారం చేయాలనేవారికి అద్భుత అవకాశం.. ఎల్లుండే ఆఖరి తేదీ

Also Read: RK Roja: మాజీ మంత్రి రోజాను 'ఆంటీ' అంటూ నోరు పారేసుకున్న సుడిగాలి సుధీర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News