Sukumar: బాలీవుడ్ స్టార్ హీరోతో సుకుమార్ సినిమా.. అది కూడా యాంటీ హీరో పాత్రలో!

Sukumar Upcoming Movie: పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రెజ్ సంపాదించుకున్నారు దర్శకుడు సుకుమార్. ప్రస్తుతం ఈ డైరెక్టర్ త్వరలోనే రామ్ చరణ్తో ఒక్క సినిమా చేయానున్నారు. ఈ క్రమంలో సుకుమార్ తదుపరి సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో కనిపించనున్నారు అన్న వార్త తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

Written by - Vishnupriya | Last Updated : Mar 18, 2025, 04:26 PM IST
Sukumar: బాలీవుడ్ స్టార్ హీరోతో సుకుమార్ సినిమా.. అది కూడా యాంటీ హీరో పాత్రలో!

Bollywood Hero In Sukumar Film: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్, బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌తో కలిసి సినిమా చేయబోతున్నారన్న వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. తాజాగా, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక కీలక అప్‌డేట్ వచ్చిందని సమాచారం. ప్రముఖ మీడియా రిపోర్ట్ ప్రకారం, సుకుమార్ ఈ చిత్రానికి ఓ ప్రత్యేకమైన జానర్‌ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.  

Add Zee News as a Preferred Source

మిడ్‌డే రిపోర్ట్ ప్రకారం, ఈ చిత్రంలో షారుక్ ఖాన్ ఓ యాంటీ-హీరో పాత్రలో కనిపించనున్నారంట. అయితే, ఇది పూర్తిగా రూరల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. ఈ సినిమాలో షారుక్ ఖాన్ ప్రేక్షకులను పూర్తిగా కొత్త లుక్‌లో ఆకట్టుకోనున్నారు. మాస్ ప్రేక్షకులకు నచ్చేలా, ఆయన గ్లోబల్ ఇమేజ్‌కు తగ్గట్లు, పూర్తిగా దేశీ అవతార్‌లో కనిపించనున్నారు. అంతేకాదు, ఈ కథలో కుల వివక్ష, సామాజిక అసమానతల వంటి విషయాలను సుకుమార్ ప్రస్తావించనున్నారని తెలుస్తోంది.  

ఇంతకు ముందు వచ్చిన వార్తల ప్రకారం, షారుక్ ఖాన్ - సుకుమార్ కాంబినేషన్‌లో ఒక డార్క్ సైకాలజికల్ థ్రిల్లర్ తెరకెక్కనుందని ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం, ఆ ప్రాజెక్ట్‌ను మార్చి ఇప్పుడు రూరల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.  

ప్రస్తుతం షారుక్ ఖాన్, సుకుమార్ ఇద్దరూ తమ తమ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. వీరి ప్రస్తుత సినిమాలు పూర్తవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుందని తెలుస్తోంది. అందువల్ల, వీరి నార్త్-సౌత్ కలయిక వాస్తవంగా అమలవ్వాలంటే ఇంకా కొంతకాలం వేచి చూడాల్సిందే.  

కాగా షారుఖ్ ఖాన్ జవాన్, పఠాన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన సంగతి తెలిసిందే. ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తే.. ఆయన మార్కెట్ టాలీవుడ్ లో మరింత పెరిగే అవకాశం తప్పకుండా ఉంది. అందుకే సౌత్ లో తన మార్కెట్ ని ఇంకొంచెం పెంచుకోవడానికి షారుక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

Also Read: Red Cells: శరీరంలో ఎర్ర రక్త కణాల పాత్ర ఏమిటీ? అవి పెరగాలంటే ఏం తినాలి?

Also Read: Bumper Bonanza: ఐపీఎల్‌ బంపర్‌ బొనాంజా.. మ్యాచ్‌లకు ఉచిత ప్రయాణం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News