Jawan OTT Release Update: దిమ్మతిరిగే రేటుకు జవాన్ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Jawan Box Office Collections and OTT Release Date: బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న జవాన్ మూవీ ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు తెలిసింది. రూ.250 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం. దీనిపై చిత్రబృందం అధికారిక సమాచారం వెల్లడించాల్సి ఉంది. ఇక జవాన్ సినిమా ఇప్పటివరకు రూ.600 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.
Jawan Box Office Collections and OTT Release Date: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ జవాన్ మూవీతో బాక్సాఫీసు వద్ద తన ఖలేజా చూపిస్తున్నాడు. సెప్టెంబర్ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. బుధవారం 7వ రోజు రూ.23 కోట్లు వసూళ్లు రాబట్టింది. దీంతో హిందీలో రూ.367.58 కోట్లకు చేరింది. వీకెండ్ వచ్చేస్తుండడంతో మరింత కలెక్షన్లు పెరుగుతాయని ట్రెడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేవలం హిందీలోనే 400 కోట్ల రూపాయల మార్క్‌కు చేరుకోవడం ఖాయమంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది.
స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం హిందీతోపాటు తమిళం, తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదలైంది. షారుక్ ఖాన్‌తో పాటు, నయనతార విజయ్ సేతుపతి, సంజీతా భట్టాచార్య, సన్యా మల్హోత్రా, ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీతోనే నయనతార బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. దీపికా పదుకొణె, సంజయ్ దత్ కూడా ప్రత్యేక పాత్రలో మెరిశారు. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి.
జవాన్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. దాదాపు 250 కోట్ల రూపాయలకు ఓటీటీ రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు తెలిసింది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఓటీటీ విడుదల తేదీ కూడా ఇంకా వెల్లడి కాలేదు. నిబంధనల ప్రకారం.. ఏదైనా మూవీ థియేటర్లలో విడుదలైన 4 వారాల తర్వాతనే ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం జవాన్ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబడుతుండడంతో ఓటీటీలో కాస్త ఆలస్యంగా స్ట్రీమింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది. జవాన్ వసూళ్లు చేస్తుండటంతో కాస్త ఆలస్యంగా రిలీజ్ అవుతుంది. జవాన్ మూవీని తమ సొంత బ్యానర్ రెడ్ చెల్లీస్‌లో షారుఖ్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మించింది.
Also Read: Health Tips in Telugu: పాలలో ఖర్జూరం మరగబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. ఒక్కసారి తీసుకుంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook