Shambhala Making Video: ఆసక్తిరేకిస్తోన్న ‘శంబాల’ మేకింగ్ వీడియో.. విజువల్స్ తో సినిమాపై పెరిగిన అంచనాలు..

Shambhala Making Video:యంగ్ హీరో ఆది సాయి కుమార్ తన సినీ కెరీర్ లో డిఫరెంట్ మూవీస్ తో చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక కల్కి మూవీలో కల్కి పుట్టబోయే శంబాల గ్రామం గురించి ప్రస్తావన ఉంది. ఇపుడు ఆది సాయికుమార్ అదే ‘శంబాలా’ అనే ఢిఫరెంట్ మూవీ చేస్తున్నాడు.  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన  మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 15, 2025, 12:00 AM IST
Shambhala Making Video: ఆసక్తిరేకిస్తోన్న ‘శంబాల’ మేకింగ్ వీడియో.. విజువల్స్ తో సినిమాపై పెరిగిన అంచనాలు..

Shambhala Making Video: ‘శంబాలా’ మూవీ నుంచి  ఇప్పటికే ఈ సినిమా నుంచి డిఫరెంట్ పోస్టర్స్ విడుదల చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.  తాజాగా ఆడియెన్స్‌ను నూతన ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమా చేస్తున్నారు.కాల్పనిక ప్రపంచంలో జరిగే అద్భుతమైన ఘట్టాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ‘శంబాల’ చిత్రాన్ని పూర్తి చేస్తున్నారు ఆది సాయి కుమార్.

Add Zee News as a Preferred Source

షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 'ఏ-యాడ్ ఇన్‌ఫినిటిమ్' ఫేమ్ డైరెక్టర్ యుగంధర్ ముని డైరెక్ట్ చేస్తున్నారు. ఖర్చులకు ఎక్కడా రాజీ పడకుండా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆది సాయి కుమార్ సరసన అర్చన అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుతున్న దర్శక నిర్మాతలు.. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఇప్పటికే శంబాల మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు  వరుసగా వస్తున్న అన్ని అప్ డేట్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.  ఈ క్రమంలోనే తాజాగా శంబాలా మేకింగ్ వీడియో వదిలారు మేకర్స్. టీజర్ లోడింగ్ అంటూ వదిలిన ఈ వీడియోలో సినిమా కోసం చిత్రయూనిట్ ఏ రేంజ్ లో పగలు రాత్రి ఎలా కష్టపడుతోందో చూపిస్తూ ఆసక్తి రేకెత్తించారు. తాజాగా విడుదల చేసిన ఈ వీడియో సినిమాపై ఉన్న అంచనాలకు రెట్టింపు చేసింది. ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చూడబోతున్నామని ఈ వీడియో చెప్పకనే చెప్పింది.  

ఈ  శంబాల చిత్రంలో ఆది సాయి కుమార్ జియో సైంటిస్ట్‌గా కనిపించనున్నారు. సూర్య 45వ చిత్రంలో భాగమైన శ్వాసిక ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారతీయ సిల్వర్ స్క్రీన్ పై ఇదివరకెన్నడూ టచ్ చేయని పాయింట్ తో ఈ సినిమాను సూపర్ నాచురల్ థ్రిల్లర్  తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్‌లో శిక్షణ పొందిన యుగంధర్ ముని హాలీవుడ్ స్థాయి నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకుని హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  రూపొందిస్తున్నారు. ఈ మూవీలో విజువల్స్, సాంకేతికత అత్యున్నత స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నారు. ఈ చిత్రానికి భారతీయ సంగీత విద్వాంసుడు శ్రీరామ్ మద్దూరి మ్యూజిక్ అందిస్తున్నారు.  అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ సహా మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వదులుతామని చిత్ర యూనిట్ చెబుతోంది.

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News