Shekhar Kammula Godavari Re-release: ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ మూవీల హవా ఎక్కువగా నడుస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోల బర్తడే వేడుకలకు లేదా ఏదైనా స్పెషల్ రోజులలో వారు నటించిన చిత్రాలను సైతం రీ రిలీజ్ చేస్తూ అభిమానులను ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారు మేకర్స్. ఇప్పటివరకు ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. అంతేకాకుండా కొన్ని చిత్రాలు ఫ్లాప్ అయినా కూడా రీ రిలీజ్ లో భారీ విజయాలను అందుకున్నాయి. ఇలాంటి సమయంలోనే ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ కూల్ మూవీ రీ రిలీజ్ కి సిద్ధమయ్యింది. ఆ సినిమా ఏదో కాదు గోదావరి..
డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ అద్భుతమైన చిత్రంలో హీరోగా సుమంత్, హీరోయిన్ గా కమలినీ ముఖర్జీ నటించారు. ఈ సినిమా అప్పట్లో ఎంతోమంది యూత్ ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.
ఈ సినిమా కల్ట్ క్లాసిక్ హిట్ గా నిలవడమే కాకుండా ప్రేమికులకు బాగా అర్థమయ్యే కథ కావడం చేత ఎటువంటి హడావిడి లేకుండా హాయిగా సాగిపోయే సినిమా కథగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో డైరెక్టర్ శేఖర్ కమ్ముల మెస్మరైజ్ చేశారని చెప్పవచ్చు.
ఇకపోతే ఇదిలా ఉండగా.. ఈ కల్ట్ క్లాసిక్ సినిమా గోదావరి మార్చి 1వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ తో సహా ఒక పోస్టర్ ను సైతం విడుదల చేశారు. గోదావరి సినిమాని 4k లో రీ రిలీజ్ చేయబోతున్నారట. ఈ సినిమా ఏకంగా 5 నంది అవార్డులు గెలుచుకోవడమే కాకుండా ఒక ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది. ఇందులో హీరో సుమంత్ నటన, కమలినీ ముఖర్జీ అందం అందరిని కట్టిపడేసేలా చేసిందని చెప్పవచ్చు. మరి రీ రిలీజ్ లో ఏ మేరకు ఈ సినిమా ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.
Also Read: Zee Tv Sa Re Ga Ma Pa: ప్రతిష్టాత్మక వేదికలపై 'జీ సరిగమప' గాయనీలు అద్భుత ప్రదర్శన
Also Read: Rana Naidu 2 Teaser: 'రానాని ఓడించేది అతడి తండ్రి ఒక్కడే'.. వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









